ఎన్టీఆర్ ను మించిన లీడర్ లేరు. రారు కూడా! రాలేరు కూడా ! అదంతా ఓ కల. వైఎస్సార్ కు సైతం ఆయన ఓ ఆదర్శం అంటే అది అతిశయం కాదు. వైఎస్సార్ కే కాదు వైఎస్సార్సీపీకి కూడా ఆయనే ఆదర్శం అని రాయాలి. ఎందుకంటే జగన్ సైతం అంగీకరించింది, ఎలుగెత్తి చాటింది ఎన్టీఆర్ ఆ రోజు వినిపించిన ఆత్మగౌరవ నినాదాన్నే! అందుకే ఆయన ఆ రోజు కాంగ్రెస్ పెద్దలను కాదనుకుని ఇటుగా వచ్చి వడివడిగా అడుగులు వేసి ప్రత్యేక శైలిలో వైఎస్సార్సీపీని ప్రారంభించారు.
వైఎస్సార్ కు వైఎస్ జగన్ కే కాదు కేసీఆర్ కు కూడా ఆయనే ఆదర్శం. కానీ ఆ విషయం కేసీఆర్ పైకి చెప్పుకోరు. ముఖ్యంగా ఎన్టీఆర్ ను ఆయన సమైక్యాంధ్ర రాష్ట్ర ప్రతినిధిగానూ, ఓ రోల్ మోడల్ గా, ఓ ఐకానిక్ స్ట్రక్చర్ గానే చూస్తారు. ఆ విధంగా సమైక్య పాలకుడిగా ఎన్టీఆర్ ను ఫక్తుగా వ్యతిరేకించినా, ఆయన పూర్వాశ్రమం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీనే అన్నది కాదనలేని వాస్తవం.ఆయన మీద ప్రేమతోనే కొడుకుకు తారక రామారావు అని పేరు పెట్టుకున్నారాయన.
ఎన్టీఆర్ ఏ ఒక్క సామాజికవర్గానికో ప్రతినిధి అంటే ఏడు కోట్ల తెలుగువారు ఒప్పుకోరు ఎందుకంటే ఆయన అందరికీ చెందిన వాడు. ఆత్మీయుడు. ఆయన తెలుగింటి రాముడు. ఆయన అల్లుడు చంద్రబాబు తెలుగింటి చంద్రుడు. అని అంటారే అదే నిజం కూడా! ఎన్టీఆర్ వినిపించిన ఆత్మగౌరవ నినాదంతో మరో రెండు పార్టీలు పుట్టుకు వచ్చాయి కూడా! అవే పీఆర్పీ మరియు జనసేన. ఈ రెండు పార్టీలూ మెగా బ్రదర్స్ నేతృత్వంలో ఏర్పాటై బలమైన గొంతుకను వినిపించిన సందర్భంలో ఎన్టీఆర్ ను ఓ రిఫరెన్స్ కోడ్ గా తీసుకున్నాయి. పరిణామ గతిలో భాగంగా ఇవాళ పీఆర్పీ లేదు. కానీ జనసేన ఉంది. ఆ పార్టీ వ్యవస్థాపకుడికి ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం.ఆత్మ గౌరవం నినాదంలో భాగంగా ఢిల్లీ పెద్దలను ఎదిరిగించిన ధీశాలి ఎన్టీఆర్ అని ఇప్పటికీ పవన్
ఆయన్ను స్మరిస్తారు. ఏ విధంగా చూసుకున్నా ఎన్టీఆర్ లో ఉన్న మొండి ధైర్యం మరియు వెనుదిరిగి చూడని సాహసం అనే రెండు ముఖ్య లక్షణాలను అన్ని పార్టీలూ పుణికి పుచ్చుకోవాల్సిందే!
ఆనాటి రాముడు తరువాత ఈనాటి చంద్రుడు దగ్గరకే వద్దాం.ఈయన కూడా మంచి పాలకుడు. సమర్థనీయ ధోరణిలో పనిచేసి ఫలితాలు అందుకోగల ధీశాలి. కార్యదక్షత ఉన్న సుశిక్షిత కార్యకర్త. అందుకే చంద్రబాబు పాలనలో చాలా మంచి మార్పులు వచ్చాయి. కొద్దిపాటి తప్పిదాలు ఉన్నా బాబు విజన్ దగ్గర ఏ పార్టీ కూడా అంతగా దాటుకుని వెళ్లి సాధించింది ఏమీ లేదు. ఆఖరికి సీఆర్డీఏను రద్దు చేసిన వైసీపీనే తరువాత కాలంలో దిగివచ్చి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది అంటే అదేమంత చిన్న విషయం కాదు. కనుక ఆ నాటి రాముడు నుంచి ఈనాడు చంద్రుడి వరకూ పార్టీ ఎదుగుతూ వస్తోంది. అమవాస చీకట్లను భరిస్తూ వస్తుంది. కొన్ని తప్పిదాలు దిద్దుకుంటే పార్టీ మరింత బాగుంటుంది. ఎనీ డౌట్స్ !
This post was last modified on March 30, 2022 7:05 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…