ఏపీ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం నాయకుడు.. ధర్మాన కృష్ణ దాస్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలవకపోతే.. తమ కుటుంబం.. తన తమ్ముడి(ధర్మాన ప్రసాద్)తో సహా.. రాజకీయాల నుంచి తప్పుకొంటామని వ్యాఖ్యానించా రు. “మేం చేతులకు గాజులు తొడుక్కుని లేం. చూస్తూ కూర్చోం.. వచ్చే ఎన్నికల్లో.. జగన్‌ను మళ్లీ సీఎం చేసుకునేందుకు.. ఏం చేయాలో మాకు తెలుసు“ అని కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. జగన్ గెలవకపోతే.. తమ కుటుంబం రాజకీయ సన్యాసం తీసుకుంటుందన్నారు.
మంత్రిగారి సొంత నియోజకవర్గం నర్సన్నపేటలోని కంబకాయ మండలంలో మంగళవారం ఫిష్ లే అవుట్‌కు కృష్ణదాస్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఈ రోజు రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోయింది. మీరు(ప్రజలు) ప్రతిపక్షం చేసే జిమ్మిక్కులను, మాయ మాటలను నమ్మొద్దు“ అని పిలుపునిచ్చారు. మాపై ఉన్న గౌరవం, ప్రజల దీవెనల కారణం.. రాష్ట్రంలో వైసీపీ విజయం సాధిస్తోందని.. అన్నారు. టీడీపీ నేతలు చెబుతున్న బోగసేనని అన్నారు. వారు చెబుతున్న మాటలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు.
“టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఒక మాట చెబుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఏకంగా 160 సీట్లు గెలిచేస్తాడం ట. మొన్న 20 గెలిచారు.. ఈ సారి 160 గెలిచేస్తారట! మనం ఇలా గాజులేసుకుని కూర్చుంటాం. ఇవన్నీ సొల్లు మాటలు. మీరెవరూ భయపడాల్సిన పనిలేదు. ఈ వేళ నేను చెబుతున్నాను. మళ్లీ జగన్మోహన్‌రె డ్డిగారుముఖ్యమంత్రి కాకపోతే.. వచ్చే ఎన్నికల్లో మా కుటుంబం రాజకీయ సన్యాసం తీసుకుంటుంది. రాజకీయాల నుంచి తప్పుకుంటాం. ఛాలెంజ్ చేస్తున్నా!“ అని ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు.
ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలు జగన్‌నే సీఎంగా గెలిపిస్తారని.. ధీమా వ్యక్తం చేశారు. మధ్య వర్తులు, దళారులు లేని పోని ప్రచారం చేస్తున్నారని.. వాటిని ప్రజలు విశ్వసించవద్దని.. కృష్ణదాస్ చెప్పారు. మీకు ఏది కావాలంటే అది చేయడానికి తాముసిద్ధంగా ఉన్నామని.. మంత్రి చెప్పారు.
This post was last modified on March 30, 2022 8:20 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…