తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన పార్టీగా రికార్డు సృష్టించిన.. టీడీపీకి నేటితో 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. ఆత్మ విశ్వాసంతో తెలుగు దేశం పార్టీని రామారావు స్థాపించారని స్పష్టం చేశారు. టీడీపీ ఆవిర్భవించి 40 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభై సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశం ఆవిర్భావం.. ఒక రాజకీయ అనివార్యమని వ్యాఖ్యానించారు.
కొందరు వ్యక్తుల కోసమో.. కొందరికి పదవుల కోసమో ఏర్పడిన పార్టీ కాదని చెప్పారు. ప్రజల కోసం…ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం.. ఈ 40 ఏళ్లలో సామాన్య ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చింది అని చెప్పారు. కొందరికే పరిమితం అయిన అధికారాన్ని అన్ని వర్గాలకు పంచింది అని తెలిపారు. తెలుగుదేశం అంటేనే అభివృద్ధి…సంక్షేమం అని చంద్రబాబు ఉద్ఘాటించారు.
సంస్కరణల ఫలితాలను గ్రామ స్థాయికి అందించిన చరిత్ర టీడీపీదే అని చంద్రబాబు పేర్కొన్నారు. పాలనపై పాలకులను ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పింది తెలుగుదేశమే అని వివరించారు. ఎన్టీఆర్ హయాంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు అని కొనియాడారు. “ఒక రాజకీయ అనివార్యం. కొందరు వ్యక్తుల కోసమో… కొందరికి పదవుల కోసమో ఏర్పడిన పార్టీ కాదు మన తెలుగుదేశం. ప్రజల కోసం… ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం. పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం“ అని వివరించారు.
ఈ 40 ఏళ్లలో సామాన్య ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిందన్నారు. పాలనపై పాలకులను ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పింది తెలుగుదేశమే. పార్టీ చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తుకుతెచ్చేలా తెలుగుదేశం 40 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించండని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఈ వేడుకలు ఉండాలన్నారు. రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటో ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు సాగాలని చంద్రబాబు సూచించారు.
This post was last modified on March 29, 2022 6:29 pm
డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…
ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది…
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి భారత స్టాక్ మార్కెట్ బయటపడిన మొదటి మార్కెట్‌గా…
హాస్య నటులు హీరోలు కావొచ్చేమో కానీ యాంకర్లు కథానాయకులుగా వెలుగొందటం అంత సులభం కాదు. నాలుగేళ్ల క్రితం ప్రదీప్ మాచిరాజు…
ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆమె మరో ఐదుగురు మహిళలతో కలిసి…
మ్యాన్హోల్లోకి దిగుతూ ప్రాణాలు కోల్పోయే పారిశుద్ధ్య కార్మికుల ఘటనలు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ…