ప్రస్తుతం రాష్ట్రం లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అనేక అంశాలపై నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమం లో వైసీపీ సర్కారుపై తమదైన శైలిలో నాయకులు విజృంభిస్తున్నారు. అయితే.. ఈ క్రమంలో తమ్ముళ్లు చేస్తున్న నిరసనలపై.. నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఎవరికివారు నిరసనల్లోనూ.. మైలేజీ వెతుకుతున్నారనేది నెటిజన్ల వాదన. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని.. నాయకులు బలంగా నమ్ముతున్నారు. ఇది మంచిదే. ఏ పార్టీ మాత్రం అధికారంలోకి రాకూడదని కోరుకుంటుంది.
చంద్రబాబు దూకుడుగా ఉండడంతో పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని.. నాయకులు మరింత దూకుడుగా పనిచేస్తున్నారు. చంద్రబాబు కోరుకున్నది కూడా ఇదే. వైసీపీ చేస్తున్న ఆగడాలతో .. ఆ పార్టీకి ప్రజలు ఓటేయరని.. టీడీపీనే గెలిపిస్తారని.. చంద్రబాబు నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని తన పార్టీ నాయకులకు కూడా ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలో గతంలో కన్నా ఎక్కువగా వివిధ అంశాలపై.. టీడీపీ నాయకులు ఉద్యమాలు చేస్తున్నారు. అయితే.. ఈ క్రమంలో చంద్రబాబు దృష్టిని ఆకర్షించేందుకు ఎవరికివారు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
ఎందుకంటే.. ఇప్పటి వరకు ఉన్న సీనియర్లు తెరమరుగు అయ్యారు. దీంతో మంతెనరామరాజు, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, ఆదిరెడ్డి భవానీ… వంటివారు దూకుడుగా వ్యవహరి స్తున్నారు. అయితే.. ఎవరికి వరు ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఎవరి అజెండా వారు అమలు చేస్తున్నారు. అందరూ కలిసి నట్టు గా ఉన్నా.. సాయంత్రం అయ్యే సరికి.. మీడియాలను ఎంచుకుని మరీ.. వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. ఇది ఒకరకంగా మంచిదే. పార్టీని ఈ రకంగా అయినా.. ముందుకు తీసుకువె ళ్తున్నారని.. అనుకోవచ్చు.
కానీ, ఇలా ఎవరికి వారు వ్యవహరిస్తుండడంతో వీరంతా మంత్రి పదవుల కోసమేననే టాక్ నెటిజన్ల నుంచి స్వల్ప విమర్శలు వస్తున్నాయి. మంత్రి పదవులు ఆశిస్తున్నవారు కూడా తప్పు చేస్తున్నట్టు కాదు. కానీ, మరింత ఉమ్మడిగా ఆందోళనలు చేస్తే.. అది పార్టీకి మరింత బలంగామారుతుందని.. కేవలం పదవుల కోసమే.. ఇలా చేస్తున్నారనే సిగ్నల్స్ వెళ్లడం మంచిది కాదని.. పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on March 29, 2022 12:33 pm
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…