కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపేమో నరేంద్ర మోడీ కాంగ్రెస్ ను దేశం నుండి పారదోలాలని పిలుపిస్తున్నారు. ఇదే సమయంలో ముంబాయ్ లో గడ్కరీ మాట్లాడుతూ కాంగ్రెస్ బలోపేతమవ్వాలని సూచించారు. ఓటములు ఎదురువుతున్నాయని నీరసపడి పోకుండా మళ్ళీ బలోపేతమవ్వటానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేయాలని పిలుపిచ్చారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న మోడీ పిలుపుకు గడ్కరీ పిలుపు పూర్తి విరుద్ధంగా ఉంది.
కాంగ్రెస్ బలోపేతమై ప్రతిపక్షంలో మరింత బలంగా ఉండాలని తాను చిత్తశుద్ధితో కోరుకుంటున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. వరుస పరాజయాలు ఎదురైనంత మాత్రాన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అధైర్యపడద్దని గడ్కరీ వారిని ఓదార్చారు. గుండె దిటువు చేసుకుని పార్టీ బలోపేతానికి కిందిస్థాయి నుండి అందరూ కలిసికట్టుగా పోరాటాలు చేయాలని గడ్కరీ పిలుపివ్వటమే విచిత్రంగా ఉంది. ప్రతిపక్షం బలంగా లేకపోతే ప్రాంతీయ పార్టీలదే రాజ్యంగా తయారవుతుందన్నారు.
జాతీయ నాయకత్వానికి ప్రాంతీయ పార్టీలు పోటీపడటం దేశానికి ఏమాత్రం మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్యానికి అధికార-ప్రతిపక్షాలు రెండు చక్రాల్లాంటివని గడ్కరీ చెప్పారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా నిలబడాలని చిత్తశుద్దితో కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ కాంగ్రెస్ పార్టీని నరేంద్ర మోడీ చీలికలు పీలికలు చేస్తున్న విషయం గడ్కరీకి తెలీదా ? రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలను ఎందుకని కూల్చేస్తున్నట్లు ? కర్ణాటక, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలదోసే కదా బీజేపీ అధికారంలోకి వచ్చింది.
ఒకవైపు నరేంద్ర మోడీ వ్యవహారాలను చూస్తునే మరోవైపు కాంగ్రెస్ బలంగా ఉండాలని మంత్రివర్గంలో కీలక సభ్యుడైన గడ్కరీ కాంగ్రెస్ బలోపేతమవ్వాలని కోరుకుంటుంటున్నారు. అంటే ఇందులో ఏదో హిడెన్ అజెండా ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ బలంగా ఉండాలని కోరుకుంటున్న గడ్కరీ మరి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలదోయద్దని మోడీకి ఎందుకు చెప్పలేకపోతున్నారు ? ఏదేమైనా మోదీ వ్యవహారం ఒకలాగుంటే గడ్కరీ తాజా వ్యాఖ్యలు పూర్తి విరుద్ధంగా ఉండటం కమలనాథులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
This post was last modified on March 29, 2022 12:05 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…