టీడీపీలో ప్రక్షాళన జరగాలి.. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలి.. ఇదే..పార్టీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయితే.. ఈ క్రమంలో ఒక కీలక విషయంపై చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో ఓటమి నుంచి మనం నేర్చుకున్నది ఏంటనేది.. ప్రధానంగా నాయకులు సంధిస్తున్న ప్రశ్న. గత ఎన్ని కల్లో పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని.. చంద్రబాబు చెబుతున్నారు. అయితే… వీటిలో ఎన్నింటి కి ఇప్పటి వరకు చెక్ పెట్టారు? ఎన్నింటిని.. ఆయన పరిష్కరించారు? అనేది కీలక ప్రశ్న.
ముఖ్యంగా.. గత ఎన్నికల్లో.. టీడీపీ నేతలకు.. చాలా మందికి టికెట్లు కన్ఫర్మ్ చేయడంలో.. చంద్రబాబు చాలా సమయం తీసుకున్నారు.. ఇది పార్టీలో నైతికంగా ఇబ్బందులు తీసుకువచ్చింది. వైసీపీ జాబితా చూశాకే తప్ప స్పందించని పరిస్థితిలో.. చంద్రబాబు వ్యవహరించారనే వ్యాఖ్యలు అప్పట్లోనే వినిపించాయి. ఈ నేపథ్యంలోనే.. చాలా మంది యువ నాయకులు ఓడిపోయారు. ఇదే విషయాన్ని తాజాగా.. కర్నూ లు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ టీజీ భరత్ వెల్లడించారు. టీడీపీ అధిష్టానం చివరి వరకు నాన్చి.. నాన్చి టికెట్ ఇవ్వడం వల్లే 2019 ఎన్నికల్లో ఓడిపోయా అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు… ఎన్నికలకు ఆరు నెలల ముందే టికెట్ ఇచ్చి ఉంటే సునామీ వచ్చినా గెలిచేవాడినని భరత్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కుమారుడు అయిన భరత్.. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. యువనాయకుడిగా.. ఆర్థికంగా.. అన్ని రకాలుగా మద్దతు ఉన్నా.. టికెట్‌విషయంలో.. చివరి వరకు చంద్రబాబు తాత్సారం చేశారు. ఒక్క ఇక్కడనే కాదు.. రాష్ట్రంలో దాదాపు 100 నియోజకవర్గాల్లో.. నామినేషన్లకు గడువు ముగిసిపోతుందనడానికి రెండు రోజుల ముందు ఖరారు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇది .. పార్టీలో అప్పట్లోనే చర్చకు వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? అనేది కూడా ఆసక్తిగా మారింది. వాస్తవానికి ఇప్పటికే పార్లమెంటరీ జిల్లా ఇంచార్జ్‌లు అంటూ కొందరినినియమించారు. అయితే.. వీరే వచ్చే ఎన్నికల్లోపోటీ చేస్తారా? అంటే.. లేదు. కానీ, ఇంచార్జ్‌లను మాత్రంనియమించారు. ఇక, అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ.. నాయకులను నియమించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు విజయవాడ పశ్చిమం. ఇక్కడ పార్టీకి దిక్కు మొక్కులేదు. ఇలా.. దాదాపు 70 నియోజకవర్గాల్లో నాయకులు లేరంటే ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి..చంద్రబాబు గత తప్పులను సరిదిద్దుకోవాలనేది.. యువ నేతల వాదన. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on March 27, 2022 8:36 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…