రాజకీయాల్లో ప్రత్యర్థుల దూకుడుకు కళ్లెం వేయాల్సిందే. దీనిని ఎవరూ కాదనరు. అయితే.. ఈ క్రమంలో వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. లేకపోతే.. మొత్తానికే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే.. ప్రస్తుతం టీడీపీలో ఒక చిత్రమైన విషయం తెరమీదికి వచ్చింది. టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వైసీపీ ఫైర్ బ్రాండ్ , జబర్దస్త్ రోజాను కట్టడి చేయాలని.. వచ్చే ఎన్నికల్లో ఆమెను ఓడించాలని.. టీడీపీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అందుకే.. కొన్నాళ్ల కిందట రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న కూడా `రోజా గెలిస్తే..` అంటూ సీరియస్ కామెంటే చేశారు.
ఈ నేపథ్యంలో.. రోజాను ఎట్టి పరిస్థితిలోనూ ఓడించాలనేది టీడీపీ పెట్టుకున్న లక్ష్యంగా స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు రోజా విషయంలో టీడీపీ ఒకనిర్ణయానికి వచ్చినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదేంటంటే.. రోజాపై టీడీపీ నాయకురాలు, నటి.. వాణీ విశ్వనాథ్‌ను రంగంలోకి దింపుతారని.. ఆమెను రోజాపై పోటీకిపెడతారని అంటున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనూ ఇదే తరహాలో ప్రచారం జరిగింది. కానీ, ఎందుకో.. చంద్రబాబు విరమించుకున్నారు. తర్వాత.. రోజాపై గాలి ముద్దుకృష్ణమ తనయుడిని రంగంలోకి దింపారు. నిజానికి అప్పట్లోనే గాలి భాను గెలిచి ఉండాల్సింది.
తండ్రి చనిపోయిన సెంటిమెంటులో ఆయన గెలుపు గర్రం ఎక్కి ఉండాల్సింది. అయితే.. అలా జరగలేదు. ఇక, ఇప్పుడు ఇదే రోజాపై.. వాణీవిశ్వనాథ్‌ను రంగంలోకి దింపాలని భావిస్తే.. మరోసారి ముచ్చటగా.. రోజా గెలుపునకు టీడీపీ సహకరించినట్టేనని.. సీనియర్లు చెబుతున్నారు. ఎందుకంటే. ఇప్పటి వరకు నగరి ప్రజలకు వాణీ విశ్వనాథ్.. పరిచయం లేదు. పైగా.. ఆమె ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ప్రజల్లోకి వచ్చింది కూడా లేదు. రోజా ఒక్కరే ప్రజల మద్య ఉన్నారు. ఒకవేట వాణీ పరిచయం ఉందని అనుకున్నా.. ఇప్పటికిప్పుడు రోజా వంటి ఫైర్ బ్రాండ్‌ను ఢీకొట్టే ఛాన్స్ తక్కువే అనేది .. లోకల్ టాక్.
సో.. వాణీకి టికెట్ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా.. ఇప్పటికే ప్రజలతో కనెక్ట్ అయిన.. గాలి భానును పక్కన పెట్టడం వల్ల.. ఈ వర్గం తీవ్రనిరాశలో కూరుకుపోతుంది. ఈ పరిణామంతో వీళ్లు చాపకింద నీరుగా.. వ్యతిరేక ప్రచారం చేసినా.. ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాలనే పేర్కొంటూ.. రోజాపై గాలి భాను ప్రకాశ్ రెడ్డే సరైన నాయకుడని.. సీనియర్లు చెబుతున్నారు. అసలు వాణీ విశ్వనాథ్ అనే పేరు వద్దేవద్దని.. కావాలంటే.. ఆమెకు వేరే చోట టికెట్ ఇచ్చుకోవచ్చని అంటున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on March 26, 2022 10:14 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…