రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పడం కూడా కష్టమే… ఇప్పుడు ఏపీ లోనూ అదే జరుగుతోంది. గత ఎన్నికల తర్వాత.. టీడీపీలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు.. వైసీపీకి అ నుకూలంగా మారిపోయారు. వీరు టెక్నికల్‌గా ఇప్పటికీ.. టీడీపీ సభ్యులుగానే ఉన్నారు. ఈ పార్టీ సభ్యులు గానే అసెంబ్లీ నుంచి జీతం కూడా పొందుతున్నారు. రికార్డుల్లోనూ వీరు టీడీపీ సభ్యులుగానే చలామణి అవుతున్నారు. అయినప్పటికీ.. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
వీరిలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం,, గన్నవరం ఎమ్మెల్య వల్లభనేని వంశీ, విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఉన్నారు. అయితే.. వీరిలో ముగ్గురు వైసీపీని విశ్వసించడం లేదనేవాదన బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే.. జగన్ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. ఆయన పార్టీ మారే వరకు ఒకవిధంగా తమను రెచ్చగొట్టి.. పార్టీ నుంచి దూరం అయ్యేలా చేశారని.. తీరా వచ్చిన తర్వాత.. కనీసం.. పట్టించుకోవడం లేదని.. తమ సమస్యలు చెప్పుకొనేందుకు అవకాశం కూడా ఇవ్వడం లేదని.. వీరు బాధపడుతున్నారు.
మరీ ముఖ్యంగా.. కరణం బలరాం, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీల ఆవేదన అంతా ఇంతా కాదు. ఎందుకంటే.. వీరికి ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి అనుకూలతలేక పోగా తీవ్రస్థాయిలో సెగ తగులుతోంది. నియోజకవర్గంలో వైసీపీ ఇంచార్జ్‌లుగా వీరిని నియమించరాదని.. బాహాటంగానే వైసీపీ ననేతలు రోడ్డెక్కుతున్నారు. నిన్న మొన్నటి వరకు గన్నవరంలో ఈ వివాదం రోడ్డెక్కిన విషయం వార్తల్లోకి వచ్చింది. అయితే.. చీరాలలో ఎప్పటి నుంచో కరణంకు వ్యతిరేకంగా.. ఆమంచి కృష్ణమోహన్ చక్రం తిప్పుతున్నారు.
ఇక, విశాఖ దక్షిణంలోనూ.. గణేష్‌కు వ్యతిరేకంగా.. వైసీపీ నాయకులు.. రోడ్డెక్కుతున్నారు. వైసీపీని.. ఎప్ప టి నుంచో.. కాపాడుతున్నామని.. గత ప్రభుత్వంలో అనేక కేసులు పెట్టినా ఎదుర్కొని పార్టీకోసం పనిచేశా మని.. కానీ, ఇప్పుడు వారికి ఇంచార్జ్‌లుగా అవకాశం ఇస్తే.. మేం ఏం చేయాలని. వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీనికి అధిష్టానం.. సమాధానం చెప్పాల్సి ఉన్నా.. టీడీపీ నుంచి వచ్చిన వారికి మద్దతు ఇవ్వకుండా.. చోద్యం చూస్తున్నారని.. అంటే.. తమకు ఎలానూ భరోసా లేకుండా పోయిందని.. జంపింగులు ఆవేదన వ్యక్తం చేస్తన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ సైకిల్ వైపు అడుగులు వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 26, 2022 6:15 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…