పెగాసస్‌పై ఎలాంటి విచారణకైనా సిద్ధమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు. బాబాయ్ వివేకా హత్య, మద్యం మరణాలపైనా విచారణ కమిటీ వేయగలరా? అని ముఖ్యమంత్రి జగన్ కు ఆయన సవాల్ విసిరారు. పెగాసస్‌పై పశ్చిమ బెంగాల్ సీఎం మమత అసెంబ్లీలో మాట్లాడారనే దానిపై స్పష్టత లేదన్నారు. పెగాసెస్ సాఫ్ట్‌వేర్ను తాము కొనలేదని మాజీ డీజీపీ సవాంగ్ ఆర్టీఐ దరఖాస్తు దారుకు సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు.
వ్యక్తిగత విషయాలు వినే అలవాటు తమకెవరికీ లేదన్న లోకేశ్.. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకి ఉందేమోనని అందుకే ఆయన రాసలీలలు బయట పడ్డాయని దుయ్యబట్టారు. వ్యక్తులకు, ప్రైవేట్ సంస్ధలకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ అమ్మలేదని ఇజ్రాయిల్ అంబాసిడర్ ప్రకటన కూడా చేశారన్నారు. అయినా నిబంధనలకు విరుద్దంగా సభలో పెగాసెస్ సాఫ్ట్ వేర్పై స్వల్ప కాలిక చర్చకు అనుమతించరని మండిపడ్డారు. తాము మద్యం మరణాలపై ప్రతి రోజూ డిమాండ్ చేస్తోంటే చర్చకు అనుమతించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పుడు సమాచారంతో సభలో పెగాసస్పై చర్చ పెట్టారని ఆక్షేపించారు. కల్తీ సారా, కల్తీ మద్యంతో పేదలను చంపేస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. “పెగాసస్‌పై మమత అసెంబ్లీలో మాట్లాడారనే దానిపై స్పష్టత లేదు. పెగాసెస్ సాఫ్ట్‌వేర్ కొనలేదని మాజీ డీజీపీ సవాంగ్ ఆర్టీఐ దరఖాస్తు దారుకు సమాధానం ఇచ్చారు. వ్యక్తులకు.. ప్రైవేట్ సంస్ధలకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ అమ్మలేదని ఇజ్రాయిల్ అంబాసిడర్ ప్రకటన కూడా చేశారు.
అయినా నిబంధనలకు విరుద్దంగా సభలో పెగాసెస్ సాఫ్ట్ వేర్ పై స్వల్ప కాలిక చర్చకు అనుమతించారు. మేం మద్యం మరణాలపై ప్రతి రోజూ డిమాండ్ చేస్తోంటే చర్చకు అనుమతించడం లేదు. ఏమన్నా అంటే 151 మంది ఉన్నారని అంటున్నారు.. భవిష్యత్తులో వైసీపీకి 15 మంది ఉండని పరిస్థితి. బాబాయ్ హత్య విషయంలోనూ అబద్దాలే ఆడారు.. డీఎస్పీ ప్రమోషన్ల విషయంవోనూ అబద్దాలే చెప్పారు.“ అని లోకేష్ విరుచుకుపడ్డారు. మరి దీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on March 21, 2022 11:14 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…