ఏపీ అధికార పార్టీ వైసీపీలో సొంత పార్టీ నేతపైనే నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు. “ బాబోయ్.. ఆమె మాకు వద్దు!“ అంటూ.. తేల్చి చెబుతున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో విజయం సాధించిన ఉండవల్లి శ్రీదేవిపై స్థానిక వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. వాస్తవానికి ఉండవల్లి శ్రీదేవి.. తండ్రి సుదీర్ఘ కాలం రాజకీయాలు చేశారు.. ఆయనకు ఇదే నియోజకవర్గంలో మంచి పేరు కూడా ఉంది. అందుకే.. ఆమె పెద్దగా పరిచయం లేకపోయినా.. ఆమె తండ్రిపై ఉన్న అభిమానంతో ఇక్కడి ప్రజలు ఆమెను గెలిపించారు.
కానీ, ఆమె దూకుడుతో ఇప్పుడు సొంత పార్టీ నేతలే.. అల్లాడిపోతున్నారు. ఆమెకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఎమ్మెల్యే ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని.. వలంటీర్ ఉద్యోగాలను కూడా అమ్ముకుంటున్నారని.. క్షేత్రస్థాయిలో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు సిఫారసు కూడా చేయడం లేదని.. కొందరు నాయకులు చెబుతున్నారు. వాస్తవానికి ఆది నుంచి కూడా ఉండవల్లి శ్రీదేవిపై వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కేడర్‌ను దూరం పెట్టడం.. వివాదాలకు దగ్గరగా ఉండడం ఆమెకు అలవాటుగా మారిందనే విమర్శలు ఉన్నాయి.
తన చుట్టూ కోటరీని ఏర్పాటు చేసుకుని.. నాయకులను రెండు గ్రూపులుగా విభజించారని వైసీపీలోనే చర్చ సాగుతోంది. ఏదేమైనా.. అంటే.. అధిష్టానం దగ్గర తనకు పలుకుబడి ఉందని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని.. బాహాటంగానే ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. తనకు వ్యతిరేకంగా ఉండేవారిపై పోలీసులతో కేసులు పెట్టించడం కూడా ఆమెకు అలవాటుగా మారిపోయింది.
ఇక, స్థానికంగా పనులు చేసే కాంట్రాక్టర్లను కూడా పీడిస్తున్నారని.. పనులు చేయాలంటే.. కమీషనల్ఉ ఇవ్వాలని కూడా ఒత్తిడి తెస్తున్నారని.. కొందరు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. వాస్తవానికి ఎంపీ నిదులతో జరుగుతున్న పనులకు ఆమెకు కప్పం ఎందుకుకకట్టాలంటూ.. వారు ప్రశ్నించారు. దీనిపై కొన్నాళ్ల కిందట తీవ్ర వివాదం అయింది. పనులు కూడా నిలిపి వేసుకుని.. ఎమ్మెల్యేపై చర్యలకు పట్టు బట్టడం స్థానికంగా తీవ్ర వివాదానికి దారితీసింది.
దీనిని అడ్డు పెట్టుకుని ఎంపీతోనూ ఉండవల్లి శ్రీదేవి వివాదం పెట్టుకున్నారు. అంతేకాదు.. స్థానిక నేతలను లెక్కచేయక పోవడం… వలంటీర్ వంటి ఉద్యోగాలను కూడా అమ్ముకునేందుకు ప్రయత్నిం చడం.. రాజధానిపై ఇప్పటికీ విమర్శలు చేయడం వంటివి స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే శ్రీదేవిపై సొంత పార్టీ నేతలే.. విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వొద్దని.. ఇస్తే.. తామే ఓడిస్తామని.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకులే బహిరంగంగా చెబుతుండడం గమనార్హం.మరి దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on March 21, 2022 4:24 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…