ప్రపంచ పౌర విమానయాన చరిత్రలో మరో ఘోర ప్రమాదం జరిగింది. నైరుతి చైనాలో 133 మంది ప్రయాణికులతో వెళుతోన్న విమానం కుప్పకూలింది. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం పెను ప్రమాదానికి గురైంది. పర్వతాల్లో హఠాత్తుగా విమానం కుప్పకూలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు శరవేగంగా సమీపంలోని అడవిలోకి వ్యాపించడంతో అక్కడ కార్చిచ్చు అంటుకుంది.
ఈ నేపథ్యంలోనే బాధితులను కాపాడేందుకు సహాయక చర్యలు చేయడం కష్టతరంగా మారింది. ప్రమాదం జరిగిన తీవ్రత దృష్ట్యా ప్రయాణికులు ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువని రెస్క్యూ ఆపరేషన్ టీం అభిప్రాయపడుతోంది. సోమవారం మధ్యాహ్నం 1గంట తర్వాత గ్వాంగ్జూ రీజియన్‌లోని వుజుహ్ నగరం సమీపంలోని మారుమూల పర్వత ప్రాంతంలోని టెంగ్ కౌంటీ వద్ద ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది.
కున్మింగ్ సిటీ నుంచి స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1.00 గంటకు బయలుదేరిన విమానం.. గమ్యస్థానం గ్వాంగ్జూకి నిర్దేశిత సమయానికి చేరుకోలేదని విమానాశ్రయ సిబ్బంది చెప్పారు. అయితే, ఈ ప్రమాద ఘటనపై స్పందించేందుకు చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ నిరాకరించింది. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అంతా చనిపోయారా? ఎవరైనా ప్రాణాలతో బయటపడ్డారా? అసలు ప్రమాదం ఎలా జరిగింది? కారణాలేమిటి? అన్న విషయాలపై పూర్తి అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.
This post was last modified on March 21, 2022 3:25 pm
ఈ హైటెక్ జమానాలో 24 గంటల పాటు పలు కంపెనీలు సేవలందిస్తున్నాయి. దీంతో, సాఫ్ట్ వేర్ కంపెనీలు, బీపీవోలలో నైట్…
లావణ్య త్రిపాఠి.. 2012లో విడుదలైన అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎందరో…
నిన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 సాంగ్ లాంచ్ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్…
వైసీపీకి దశ-దిశ కొరవడిందా? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా డుమ్మా కొట్టిన ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం…
మంచు విష్ణు హీరోగా తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప ఎట్టకేలకు విడుదల తేదీని…
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు దాటిపోయింది. ఫలితాలు వచ్చి కూడా ఆరు నెలలు కావస్తోంది. ఐతే ఆ…