ఒకప్పుడు కాంగ్రెస్ తో సఖ్యంగా ఉన్న ఆ గాలిపటం తరువాత ఆ బంధం ను తెంపుకుని ఇప్పుడు బీజేపీ తో పరోక్ష రీతిలో ప్రేమ పంచుకుంటోంది మరియు ప్రకటించుకుంటోంది. అందుకే ఓవైసీ తనకు తెలియకుండానే బీజేపీకి సాయం చేసి తరువాత దేశం గర్వించే స్థాయి పురస్కారాలకు ఎంపిక అయి ఉంటున్నారన్నది ప్రధాన విపక్షం ఆరోపణ.పైకి ఎంఐఎం ఏం మాట్లాడినా కూడా మతతత్వ పార్టీల అజెండా అంతా ఉద్రిక్తతలకు తావిచ్చేలా మాట్లాడడమేనని కాంగ్రెస్ తో సహా ఇతర పార్టీలు అన్నీ అభియోగాలు మోపుతూనే ఉన్నాయి. అంటే బీజేపీ బీ టీం ఎంఐఎం అని తేలిపోయింది. అదేవిధంగా ఎన్నో సందర్భాల్లో కాంగ్రెస్ కు సాయం చేసింది ఎంఐఎంనే అని కూడా మరిచిపోయి మరీ! ఇవాళ పాపం పాత మిత్రుడ్ని వివాదాల్లోకి దించుతోంది. ఓట్లూ,సీట్లూ ఎలా ఉన్నా కూడా కాంగ్రెస్ ఇచ్చిన లీక్ ఓ విధంగా మిగతా పార్లమెంటేరియన్లకు ఓ హెచ్చరిక లాంటిదే!
ఎంఐఎం అధినేత,ఎంపీ అసదుద్దీన్ ఐవైసీ కి బంపర్ ఆఫర్ దక్కనుంది అని కాంగ్రెస్ అంటోంది.ఇటీవలే సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ ను ప్లే చేస్తున్న కాంగ్రెస్ కొత్త సంగతి ఒకటి చెప్పింది. గత ఎన్నికల్లోనూ,ఇప్పుడూ కూడా బీజేపీకి ఎంతో సాయం చేసిన ఓవైసీకి 2022 ఏడాదికి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డుతో సత్కరించనుందని కాంగ్రెస్ అంటోంది. మొన్నటి యూపీ ఎన్నికల్లో ఎంతగానో ఆ పార్టీ బీజేపీకి సాయం చేసినందుకు కృతజ్ఞతగా బీజేపీ నాయకులు ఓవైసీ రుణం ఈ విధంగా తీర్చుకోనున్నారని సమాచారం. ఇదంతా కాంగ్రెస్ పైకి చెబుతున్న మాట.
మరి! గతంలో ఇదే కాంగ్రెస్ కు ఎంఐఎం ఎంతగానో సాయం చేసిందన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి అని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎంఐఎంతో మంచి అనుబంధమే కాంగ్రెస్ కు ఉంది. తరువాత కాలంలో కేసీఆర్ కు కూడా ఆయనెంతో దగ్గర! ఇప్పుడు యూపీ ఎన్నికల్లో కాస్తో కూస్తో కమలం పార్టీకి అనుగుణంగానే ఉన్నారు. అందుకే ఆయనకు మంచి స్థాయిలో సత్కారం అందించాలన్నది యూపీ బీజేపీ పెద్దల సలహా.. అదేవిధంగా బీజేపీ అధినాయకత్వం ఆలోచన అన్నది కాంగ్రెస్ ఆరోపణ.
వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో యోగి హవాకు ఎంఐఎం ఊతం ఇచ్చింది పెద్దగా ఏం లేదు కానీ భావోద్వేగ సంబంధ రాజకీయం మాత్రం బాగానే నడిపారు. పైకి ఆయన బీజేపీపై నిప్పులు చెరిగినా పరోక్ష రీతిలో అసదుద్దీన్ ఓవైసీ బీజేపీకే సాయం చేశారు. కొన్ని కీలక ప్రకటనలు మరియు వ్యాఖ్యలు ఆ వేళ బాగానే పనిచేశాయి.అవన్నీ యోగి గెలుపు అవకాశాలను మెరుగుపరిచే ఉండాలి. అందుకే ఆయనకు సముచిత ప్రాధాన్యం ఇవాళ బీజేపీ ఇస్తుంది అన్నది ఓ ఆరోపణ.
This post was last modified on March 21, 2022 11:52 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…