ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు దాదాపు ముహూర్తం ఖరారైంది. వాస్తవానికి రెండున్నరేళ్లలోనే మంత్రి వర్గాన్ని మారుస్తానని.. 2019 లోనే సీఎం జగన్ ప్రకటించారు. మొత్తం 90 శాతం మందిని మారుస్తామన్నారు. అయితే.. కరోనా నేపథ్యంలో ఈ మంత్రి వర్గ ప్రక్షాళన ఆలస్యమైంది. ఇక, ఎప్పటికప్పుడు.. అదిగో ఇదిగో అంటూ.. ఊరిస్తూ వచ్చారనే వాదన వైసీపీ నేతల మధ్య ఉంది. ఇక, తాజాగా దీనిపై.. సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. జూలై 8న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతినిపురస్కరించుకుని.. పార్టీ ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు. ఇది అయిన తర్వాత.. మంత్రి వర్గ కూర్పు ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. దక్కిన వారు అదృష్టవంతులు.. దక్కనివారు కాదనే వాదన కూడా సరైంది కాదన్నారు.
అందరూ ముఖ్యులేనని.. తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి వర్గంపై ఆశలు పెట్టుకున్నవారు.. మురిసిపోతున్నారు. ఇదిలావుం టే.. కీలకమైన శాఖలపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఏ రాష్ట్రంలో అయినా.. కీలకమైన శాఖగా.. హోం శాఖను పేర్కొం టారు. అదేవిధంగా ఏపీలోనూ ఈ శాఖను తదుపరి ఎవరికి కేటాయిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ శాఖ విషయంలో జగన్ .. ఎస్సీ వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. 2019లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి విజయం దక్కించుకున్న వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా పేరున్న సుచరితకు ఈ శాఖను అప్పగించారు.
సరే.. ఈ రెండున్నరేళ్లలో ఆమె వివాదాలు ఎదుర్కొనడం.. మహిళ హోం మంత్రిగా ఉండికూడా.. మహిళలపై దాడులు అరికట్టలేక పోతున్నారనే వివాదాల్లో చిక్కుకోవడం తెలిసిందే. అంతేకాదు.. కేవలం పేరుకే.. ఆమె హోం మంత్రి అని.. పరోక్షంగా ఓ సలహాదారు చక్రం తిప్పుతున్నారని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమెను తప్పించడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈ పదవిని ఎవరు దక్కించుకుంటారనే అంశం.. వైసీపీలో ఆసక్తికర చర్చకు దారితీసింది.
రంగంలో నలుగురు
హోం శాఖపై ఆశలు పెట్టుకున్నవారిలో నలుగురు మహిళలు కనిపిస్తున్నారని అంటున్నారు వైసీపీ సీనియర్లు. వాస్తవానికి ఈ శాఖను మహిళకు, అందునా.. ఎస్సీ వర్గానికి కేటాయించిన నేపథ్యంలో తిరిగి ఆ వర్గానికే కేటాయించే అవకాశం మెండుగా ఉంది. లేకపోతే.. పొలిటికల్‌గా విమర్శలు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళకే ఈ శాఖను అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది ఇక, ఈ శాఖను దక్కించుకునే రేసులో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని.. తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన రెడ్డి శాంతి ఈ రేసులో ముందు వరసులో ఉన్నారని సీనియర్ల మధ్య చర్చసాగుతోంది. అదేసమయంలో అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి(ఎస్సీ), అదేవిధంగా గుంటూరుకు చెందిన మహిళా ఎమ్మెల్యే(బీసీ) కూడా హోం మంత్రి పదవిని ఆశిస్తున్నవారి జాబితాలో ఉన్నారని తెలుస్తోంది. వీరితో పాటు..ఎమ్మెల్యే రోజా.. కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత.. వైసీపీ అతిపెద్దపార్టీగా ఆవిర్భవించాక.. రోజానే హోం మంత్రి అంటూ.. పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ, జగన్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా సుచరితకు కట్టబెట్టారు.
సో.. ఇప్పుడు కూడా రెడ్డి వర్గానికి హోం మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి.. రోజాపై చర్చ అనవసరం అంటున్నారు వైసీపీలోని సీనియర్ నాయకులు. ఇక, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవిద్యావంతురాలు, వినయశీలిగా పార్టీలో పేరున్న సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి దాదాపు 60 శాతం ఈ పదవి దక్కే ఛాన్స్ ఉందని వారే చెబుతున్నారు. ఒకవేళ.. బీసీ కోటాకు కేటాయించి.. ఎస్సీలకు ఏదైనా కీలక పదవి ఇవ్వాలని భావిస్తే.. అప్పుడు గుంటూరుకు చెందిన నాయకురాలి పేరును పరిశీలించే చాన్స్ ఉందని అంటున్నారు. ఏదేమైనా.. హోం శాఖను ఈ సారి ఆచితూచి ఇచ్చే అవకాశం మాత్రం క్లియర్‌గా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 18, 2022 8:23 pm
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మధ్యంతర…
ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం.…
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వ తీరుపై తన వినూత్న నిరసనతో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల…