ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వ వైద్యులకు గుదిబండలా మారటమే కాదు.. పేషెంట్లకు వైద్యం చేయటం కంటే.. రోజువారీగా పోస్టు చేయాల్సిన సెల్ఫీలతోనే పుణ్యకాలం గడిచేలా తాజా నిర్ణయం ఉందంటున్నారు. ఏపీలోని జగన్ సర్కారు తీసుకున్న ఈ సెల్ఫీ నిర్ణయంపై వైద్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసేలా తాజా మార్గదర్శకాలు ఉన్నాయని చెబుతున్నారు.
కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫీ పాలసీ ప్రకారం చూస్తే.. ఏపీ వ్యాప్తంగా ఉండే ప్రభుత్వ వైద్యులు ప్రతి రెండు గంటలకు ఒకసారి తమ సెల్ఫీని పోస్టు చేయాల్సి ఉంటుంది. అది కూడా తాము పని చేసే ఆసుపత్రి ఆవరణ స్పష్టంగా కనిపించాలి. ఈ తీరులో రోజుకు ఐదు సార్లు సెల్ఫీలు దిగి పోస్టు చేయటంతో పాటు.. ఈ లెక్కలో ఏ చిన్న తేడా వచ్చినా నెలవారీ జీతంలో కోత పెడతామన్న మాటపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అంతేకాదు.. ప్రభుత్వ వైద్యులు తమ ఇంటి వద్ద చేసుకునే ప్రైవేటుప్రాక్టీసు విషయంలోనూ పరిమితులు విధించారు. దీంతో.. వారంతా రోజు మొత్తం ప్రభుత్వ ఆసుపత్రికే పరిమితం కావాలే తప్పించి.. ప్రైవేటు ప్రాక్టీసు వైపు కన్నెత్తి చూసే అవకాశం ఉండదని చెబుతున్నారు. తాజా నిర్ణయంతో ఏపీని సెల్ఫీ ప్రదేశ్ గా మారుస్తున్నారన్న మండిపాటు వ్యక్తమవుతోంది. కొత్తగా తీసుకురావాలని భావిస్తున్న ఈ సెల్ఫీ విధానానికి కచ్ఛితమైన మార్గదర్శకాల్ని సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే బయో మెట్రిక్ తోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అది సరిపోదన్నట్లుగా ఇప్పుడు ఏకంగా సెల్ఫీలు దిగి పోస్టు చేయటం.. వాటిల్లో ఆసుపత్రి బ్యాక్ గ్రౌండ్ పక్కాగా ఉండాలని చెబుతున్న వైనంపై మండిపాటు వ్యక్తమవుతోంది. రోజుకు ఐదు సెల్ఫీలు పోస్టు చేయాలన్న ఆలోచనపై మహిళా వైద్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమను ఇబ్బందులకు గురి చేస్తాయని వాదిస్తున్నారు. సెల్ఫీలు ఏ మాత్రం అప్ లోడ్ చేయకున్నా.. జీతాల్లోకోత పెడతారన్న మాటపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరి.. వైద్యుల విషయంలో అమల్లోకి రానున్న ఈ సెల్ఫీ పరీక్ష జగన్ ప్రభుత్వంపై మరింత నెగిటివిటీని పెంచేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on March 18, 2022 1:01 pm
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…