ఏపీ సీఎం జగన్ చెల్లెలు భర్త, ప్రముఖ సువార్త ప్రసంగీకుడు, బ్రదర్ అనిల్ కుమార్.. ఏపీ సర్కారుపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి బిసి వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్య మంత్రి కావాల్సిన అవసరం ఉందని అన్నారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆయన .. మీడియాతో మాట్లాడుతూ. రాష్ట్రంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన క్రైస్తవులు, బీసీలు, మైనారిటీల ఆకాంక్షలు ఇప్పటికీ తీరలేదని అన్నారు. క్రైస్తవ సంఘాలు, బీసీ, మైనారిటీలకు చెందిన వ్యక్తులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడానికి తనను పిలిచారని, వారి బాధలు విన్నానని అన్నారు.
ఒక్క అవకాశం అంటే తాము అన్ని పార్టీలనూ వదిలి జగన్ కు మద్దతు తెలిపామని తనను కలిసిన వారు చెప్పినట్లు అనిల్ వివరించారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోలేదని తెలిపారని బ్రదర్ అనిల్ అన్నారు. ఎన్నికలలో జగన్ కు సపోర్టు చేస్తే వారి సమస్యలు తీరుస్తానని తాను హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. దేవుడిని నమ్మే తాను అసత్యాలు మాట్లాడలేనని, తాను ఇచ్చిన మాట చెల్లుబాటు కానందున ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నట్లు బ్రదర్ అనిల్ తెలిపారు. వారి సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తానని వినకపోతే ప్రత్యామ్నాయం చూస్తామని అన్నారు.
వివిధ సంఘాల ప్రతినిధులు తనతో బాధలు చెప్పుకున్నారన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీకు వారంతా సాయం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు వారి బాధలు పట్టించుకునేవారే లేరన్నారు. సమయం కుదిరినప్పుడు సీఎం జగన్‌ను కలిసి సమస్యలను వివరించే ప్రయత్నం చేస్తానన్నారు. రాష్ట్రంలోని 70 స్థానాలలో బ్రదర్ అనిల్ ప్రభావం వల్ల, ఆయన ఇచ్చిన మాట వల్ల తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేశామని బ్రదర్ అనిల్ తో సమావేశం అయిన వారు చెప్పారు. బ్రదర్ అనిల్ మద్దతు లేకపోతే 70 స్థానాలలో ఈ ఫలితాలు వచ్చేవి కాదని వారన్నారు.
“నేను రాజకీయ విషయాలు మాట్లాడను. నేనెప్పుడూ అసెంబ్లీ వైపు వెళ్లేవాడిని కాదు. నా బిజీలో నేను.. పథకాల బిజీలో సీఎం ఉన్నారు. అన్ని సమస్యలూ సీఎం దృష్టికి తీసుకెళ్తా. నేను సీఎంను కలిసి రెండున్నరేళ్లు అయింది. క్రైస్తవ సంఘాలకు అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యామ్నాయ పార్టీ పెడతామంటున్నారు.. వారికి మద్దతుగా ఉంటా. ఎన్నికల ముందు నన్ను నమ్మి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేశారు. ఇప్పుడు వారు బాధలో ఉంటే స్పందించే బాధ్యత నాకు ఉంది.“ అని అనిల్ చెప్పారు.
వివేకా హత్యపై..
వివేకా హత్య కేసుపైనా స్పందించిన బ్రదర్ అనిల్.. దోషులు తప్పించుకోలేరని అన్నారు. హత్య కేసుపై సీబీఐ విచారణ చేస్తోందంటే చిన్న విషయం కాదని అన్నారు. త్వరలోనే దోషులెవరో తెలనుందని తెలిపారు. సీబీఐ అత్యంత పెద్ద ఆర్గనైజేషన్ అని.. నేరస్తులు తప్పించుకోలేరని.. అనిల్ చెప్పారు. అయితే.. తనకు ఈ కేసు గురించి ఏమీ తెలియదని అన్నారు. తను పెద్దగా ఈ కేసును పట్టించుకోలేదని చెప్పారు.
This post was last modified on March 14, 2022 9:32 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…