Political News

బొత్స ఇంటి వేడుక‌ల్లో టీడీపీ యువ నేత

రాజ‌కీయాల్లో శ‌త్రుత్వం ఏమీ ఉండ‌దు.. జ‌స్ట్ పైకి మాట్లాడినంత కోపాలూ తాపాలూ లోప‌ల ఉండ‌వు. ఉండ‌కూడ‌దు కూడా! నిన్న‌టి వేళ బొత్స ఇంటి వేడుక‌లకు టీడీపీ నేత‌లు కూడా హాజ‌ర‌య్యారు. కుమారుడు డాక్ట‌ర్ సందీప్ వెడ్డింగ్ రిసెప్ష‌న్ కు అన్ని పార్టీల నాయ‌కులు హాజ‌రయ్యారు. ఓ టీడీపీ యువ నేత మాత్రం స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచారు. ఆయ‌నే మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం త‌ర‌ఫున బొత్స‌తో త‌ల‌ప‌డేది ఆయ‌నే!

ఇప్ప‌టికే జిల్లా పార్టీ అధ్య‌క్ష బాధ్య‌తలు కూడా ఆయ‌నే చూస్తున్నారు. చాలా యాక్టివ్ గా ఉంటారు. అన‌వ‌స‌ర వ్యాఖ్య‌లు చేయ‌రు. ముఖ్యంగా వైసీపీ స‌ర్కారు పై విధాన‌ప‌ర‌మైన పోరాట‌మే చేస్తారు.అంతేకానీ బూతులు మాట్లాడ‌రు. మంచి విద్యావంతుడు రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న నాయ‌కుడు కావ‌డంతో ఇప్ప‌టికే మంచి ఫాలోయింగ్ వ‌చ్చింది. నిన్న‌టి వేళ ఆయ‌న స‌భా ప్రాంగ‌ణానికి చేరుకోగానే  

బొత్స ఎంతో ఆత్మీయంగా ప‌ల‌క‌రించి, వెన్నుత‌ట్టి అభినందించారు. ఇప్పుడిప్పుడే రాజ‌కీయాల్లో అడుగులు వేస్తున్న సందీప్ (బొత్స కుమారుడు) దంప‌తుల‌ను ప‌రిచ‌యం చేసి కాసేపు న‌వ్వులు పూయించారు. బొత్స భార్య మాజీ ఎంపీ ఝాన్సీ కూడా ఎంతో ఆద‌రంగా నాగార్జున తో మాట్లాడారు. ఈ మాట‌లు ఫొటోలు అన్నీ ఇప్పుడు విజ‌య న‌గ‌రం జిల్లాలోనే కాదుసోష‌ల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతున్నాయి. వేడుక‌ల‌కు వెళ్లిన ఫొటోల‌ను నాగార్జున త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేశారు. నూత‌న దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.వాస్తవానికి కిమిడి కుటుంబానికి బొత్స కుటుంబానికి పెద్ద‌గా వైర‌మేమీ లేద‌నే అంటారు కొంద‌రు.

మ‌రీ అంత ఘోరంగా బొత్స‌ను ఆ కుటుంబం తిట్టిన దాఖలాలు లేవు.వివాదాల‌కు దూరంగా ఉంటూ విధాన పరంగా విమ‌ర్శిస్తూ పార్టీ చెప్పిన ప‌ని చెప్పిన విధంగా చేసుకుపోవ‌డంతో బొత్స కుటుంబం కూడా అనేక సంద‌ర్బాల్లో హుందాగానే కిమిడి కుటుంబం విష‌య‌మై వ్య‌వ‌హ‌రించ‌ద‌న్న‌ది కొంద‌రి మాట. ఇక బొత్సఇంటి ఆతిథ్యం ఎంతో బాగుంటుంద‌ని సాక్షాత్తూ కేటీఆర్ (తెలంగాణ మంత్రి) ఎన్న‌డో ప్ర‌శంసించారు. అదే నిన్న‌టి వేళ నిరూపితం అయింది. ఇక నిన్న‌టి వేళ వేడుక‌ల్లో కుర‌సాల క‌న్న‌బాబు, అనిల్ తో స‌హా ప‌లువురు మంత్రులు నాయ‌కులు ఎంతో ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఆద్యంతం ఈ వేడుక క‌న్నుల పండుగ‌గా సాగింది. పార్టీలు వేర‌యినా నాయ‌కులంతా ఓ చోట‌కు చేరుకుని ఆనందాలు పంచుకోవ‌డం మంచి ప‌రిణామ‌మే క‌దా! 

This post was last modified on March 10, 2022 10:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago