ఎగ్జిట్ పోల్స్ సర్వేలో ఉత్తరప్రదేశ్ లో బీజేపీనే గెలుస్తోందని అర్ధమైంది. యూపీలో మొదటి నుండి బీజేపీని గెలుస్తుందని చాలామంది నమ్మారు. ఎందుకంటే యోగి ఆదిత్యనాద్ ప్రభుత్వంపై జనాల్లో అనేక విషయాల్లో వ్యతిరేకత ఉన్నా సానుకూలత కూడా ఉంది. ఆ సానుకూలత వల్లే తాజా ఎన్నికల్లో మహిళలు ఎక్కువమంది బీజేపీకి ఓట్లేశారట. అంతటి అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే లా అండ్ ఆర్డర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిందే. 2012-17 మధ్య ఎస్పీ అధికారంలో ఉంది. మహిళలు ఎందుకు ఓట్లేశారని తెలుసుకోవాలంటే కాస్త చరిత్రలోకి వెళ్ళాలి.
అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ చాలా ఘోరంగా తయారైంది. ముఖ్యంగా రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ముస్లిం మాఫియాతో పాటు కొన్ని ప్రాంతాల్లో హిందు మాఫియాలు కూడా యధేచ్చగా రాజ్యమేలాయి. ఈ రెండు మాఫియాలకు అఖిలేష్ ప్రభుత్వం మద్దతుందని జనాలు నమ్మారు. ఎందుకంటే తమకు అన్యాయం జరిగిందని ఎవరు ఫిర్యాదులు చేసినా ఎవరిపైనా పోలీసులు యాక్షన్ తీసుకున్నదిలేదు. మహిళలకు, యువతులు అయితే స్వేచ్చగా బయటకాదు కదా ఇళ్ళల్లో కూడా ఉండలేకపోయారట.
ఇలాంటి పరిస్ధితుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చి యోగి బాధ్యతలు తీసుకున్నారు. అక్కడి నుండి పోలీసులకు ఫ్రీహ్యాండ్ ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ మెయినటైన్ చేయటం కోసం మాఫియా వెంటపడ్డారు. చాలామంది మాఫియా లీడర్లను కాల్చిచంపేశారు. దెబ్బకు కొందరు రాష్ట్రం వదిలిపారిపోయారు. మరికొందరు లొంగిపోయి జైళ్ళల్లో మగ్గుతున్నారు. బెయిల్ ఇచ్చినా బయటకు రావటంలేదట. కారణం ఏమిటంటే బయటకు వస్తే పోలీసులు చంపేస్తారని భయమే.
దీనిదెబ్బకు మహిళల్లో ఆత్మవిశ్వాసం మొదలైంది. మహిళలు, యువతులు స్వేచ్చగా కాలేజీలకు, స్కూళ్ళకు, మార్కెట్లకు తిరగ్గలుగుతున్నారు. అందుకనే మొన్నటి పోలింగ్ లో 48 శాతంమంది మహిళలు బీజేపీకి ఓట్లేసినట్లు సెఫాలజిస్టులు తేల్చారు. ఎస్పీకి కూడా మహిళల ఓట్లు పడినా అది 36 శాతమేనట. అంటే ఎస్పీకన్నా బీజేపీకి 16 శాతం మహిళల ఓట్లు ఎక్కువగా పడిన కారణంగానే బీజేపీ అధికారంలోకి వస్తుందని సెఫాలజిస్టులు నిర్ధారించారు.
This post was last modified on March 10, 2022 4:57 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…