షర్మిలక్కను మాట్లాడనివ్వకుండా చేశాడు పీకే (ప్రశాంత్ కిశోర్). ఆ బీహారీ మాట కారణంగానే కాంగ్రెస్ కు కూడా చుక్కలు కనపడుతున్నాయి. దీంతో కాంగ్రెస్ వ్యూహకర్త ఎస్కే డైలమాలో పడిపోయారు. ఆయన కూడా పీకే శిష్యుడే కావడం గమనార్హం. పీకే పోయి ఎస్కే (సునీల్ కనుగోల) వచ్చే ఢాం ఢాం ఢాం అని కాంగ్రేసోళ్లు నిన్నటి వరకూ పాటలు పాడుకుంటూ హాయిగా నిద్దురపోయారు. కలలు కన్నారు. రానున్న కాలంలో తమకు అంతా మంచే జరిగి తీరుతుందని అన్నారు అనుకున్నారు కూడా! ఇంతలోనే ఉగాది రాక ముందే చేదు వార్త వచ్చేసింది. తిన్న తీపి కాస్త విరుగుడు అయిపోయింది.
దీంతో రేవంత్ అన్న ఇప్పుడు డైలమాలో పడిపోయారు. వాస్తవానికి కాంగ్రెస్ వ్యూహకర్తగా కానీ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ కి కానీ వ్యూహకర్తగా ఉండాల్సిన పీకే కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి గూటికి చేరి తన స్థాయిని పెంచుకుని సత్తా చాటుతున్నారు.గత ఎన్నికల్లో జగన్ కు ఎంతగానో సహకరించిన పీకే ఈ సారి పూర్తిగా మారిపోయారు. ఎప్పటికప్పుడు వ్యతిరేకత వ్యక్తం అవుతున్న ఉచిత పథకాల యవ్వారం ఎందుకని హాయిగా రూటు మార్చి ఉద్యోగాల నియామకంపై దృష్టి పెట్టి హిట్టు కొట్టారు.
మొన్నటి వేళ మల్లన్న సాగరం చూశాక ఇతర తెలంగాణ ప్రాధాన్యాంశాలు అన్నీ కేసీఆర్ నోట విన్నాక జరిగిన మార్పు ఇది. ఇక ఇదే ఫార్ములా దేశ వ్యాప్తంగా అమలు చేసే విధంగా ప్రయత్నిస్తే, అందుకు మిత్ర పక్షంగా ఉన్న ఇతర రాష్ట్రాల పెద్దలు కూడా కేసీఆర్ కు సహకరిస్తే కొత్తగా ఏర్పాటు అయ్యే అలయెన్స్ అన్నది తప్పక విజయం సాధిస్తుంది.అందుకే ఇప్పుడీ ఫార్ములాను
బెడిసి కొట్టనివ్వకుండా త్వరలోనే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయించనున్నారు.అంతేకాదు నోటిఫికేషన్లు కూడా వీలున్నంత వేగంగానే రానున్నాయి. జోన్ల ఖాళీలు, జిల్లాల ఖాళీలు ఏంటన్నవి తేలిపోయాక ఇక తిరుగేముంది..మనకు ఇక ఎదురేమున్నది అని నిరుద్యోగులు భావిస్తూ కొత్త నోటిఫికేషన్ల రాక కోసం నిరీక్షణలు ఇక ఉండవని ఆశిస్తూ ఉన్నారు. అందుకే పీకే ఎంటరైతే సీన్ మారిపోద్ది అని అంటున్నారు వీరంతా! ఎనీవే థాంక్ యూ పీకే.. అండ్ థాంక్ కేసీఆర్ సర్ …ఈ రెండు మాటలు కూడా సామాజిక మాధ్యమాల్లో మార్మోగి పోతున్నవి.
This post was last modified on March 9, 2022 11:03 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…