Political News

జ‌గ‌న్‌పై ఆర్య వైశ్యుల ఫైర్‌.. రీజ‌న్ ఇదే!

సీఎం జగన్‌పై ఆర్యవైశ్య నేతలు బాబు, సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య‌కు అసెంబ్లీ‎లో సంతాపం ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి గౌతమ్ రెడ్డి‎కు మాత్రమే సంతాపం తెలిపారన్నారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే రోశయ్యకు సంతాపం తెలపలేదని ఆరోపించారు. సీఎంగా , గవర్నర్‎గా సీనియర్ నేత రోశయ్య  పని చేశారని, రోశయ్య మృతి చెందినప్పుడు కూడా జగన్ కనీసం నివాళులు అర్పించలేదని చెప్పారు.

ఆర్యవైశ్యులు అంటే జగన్‌కి చులకన భావమని మండిపడ్డారు. ఆర్యవైశ్యులపై జగన్ కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని, రాబోవు రోజుల్లో ఆర్యవైశ్యులు గట్టిగా బుద్ధి చెబుతారని బాబు, సత్యనారాయణ హెచ్చరించారు. రోశ‌య్య చేసిన త‌ప్పేంట‌ని వారు ప్ర‌శ్నించారు. వైఎస్ గ‌తంలో ఎంతో ప్రేమ‌గా `అన్న‌` అని పిలుచుకున్న రోశ‌య్య‌ను క‌నీసం ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

రోశ‌య్య ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో వైఎస్ ఆత్మ కూడా జ‌గ‌న్ చేసిన ప‌నికి క్షోభిస్తుంద‌ని వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా చూపి.. జ‌గ‌న్‌కు బుద్ది చెబుతామ‌ని హెచ్చ‌రించారు. మ‌రోవైపు మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత‌ అయ్యన్న పాత్రుడు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి పట్ల ఏపీ అసెంబ్లీలో సంతాపం తెలియజేయకపోవడంపై  ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘‘ఇదేందయ్యా జగనూ…. మాజీ సీఎం, మాజీ గవర్నర్‌గా పనిచేసిన కొణిజేటి రోశయ్య గారికి కనీసం సభలో సంతాపం కూడా చెప్పడానికి మనసు రాలేదా?. నీ తండ్రి కి అత్యంత ఆత్మీయుడిగా మెలిగిన రోశయ్య గారు చనిపోతే నాడు నివాళికీ నువ్వు వెళ్లలేదు. నేడు కనీసం సభలో గౌరవంగా సంతాపం కూడా తెలుపలేదు. నాడు నీ నైజాన్ని, నిజ స్వరూపాన్ని ప్రపంచానికి తెలిపింది రోశయ్య గారు అనే నీకు ఇంత కక్ష అనేది బయట టాక్. నీ స్నేహితుడు అయిన గౌతమ్ రెడ్డికి సంతాపం తెలిపిన నువ్వు… మీ తండ్రి అన్నలా భావించిన రోశయ్యకు మాత్రం సంతాపం తెలుపలేదు’’ అంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.

This post was last modified on March 9, 2022 8:11 am

Share

Recent Posts

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

1 hour ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

9 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

9 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

9 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

10 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

10 hours ago