Political News

కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తాండు.. మ‌రి జ‌గ‌న్ !

రేపు ప‌ది గంటల‌కు అసెంబ్లీలో కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తానంటూ తెలంగాణ సీఎం చంద్ర‌శేఖ‌ర రావు వెల్ల‌డించారు. ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి తీపి క‌బురు ఒక‌టి వెల్ల‌డిస్తాన‌ని అన్నారు. ఇవాళ వ‌న‌ప‌ర్తిలో నిర్వ‌హించిన సభ‌లో ఆయ‌నీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఇప్పుడు అంద‌రి ఆస‌క్తీ రేపటి పైనే ! దీంతో టీపీపీఎస్సీ కి సంబంధించి ప్ర‌క్రియ ఎలా ఉండ‌నుంది అన్న ఆశ కూడా ఉంది. వివిధ కార్యాల‌యాల్లో నెల‌కొన్న ఖాళీలు ఏ విధంగా  భ‌ర్తీ అయి నోటిఫికేష‌న్ల  రూపంలో నిరుద్యోగ జీవితాల‌కు న‌జ‌రానాలు అంద‌నున్నాయో అన్న ఆశ సంబంధిత వ‌ర్గాల్లో ఉంది.

ఇదంతా బాగానే ఉన్నా ఇప్ప‌టిదాకా ఏడేళ్ల కాల వ్య‌వ‌ధిలో వైద్య ఆరోగ్య శాఖ లో కానీ ఇత‌ర కీలక శాఖ‌ల్లో కానీ పోస్టుల ఊసే లేని కేసీఆర్ ఈ సారి ఎందుకు స్టాండ్ మారుస్తున్నార‌ని ? ఢిల్లీ ప‌రిణామాలు అన్నీ బీజేపీ కి అనుకూలం అయితే తానెందుకు హ‌డ‌లిపోతున్నార‌ని? ఇవ‌న్నీ ఎలా ఉన్నా ఘంటా చ‌క్ర‌పాణి లాంటి చ‌దువుకున్న వాళ్లున్న టీపీపీఎస్సీ ఇంత‌కాలం నిర్వీర్యం అయిపోయి ఆఖ‌రికి పెద్ద‌గా ప‌నిలేని సంస్థ‌గా ఎందుకు మిగిలింద‌ని?

ఇదే సంద‌ర్భంలో తెలంగాణ‌తో పాటు ఆంధ్రాలో కూడా ఉద్యోగాల భ‌ర్తీపై కొన్ని విమ‌ర్శ‌లు రేగుతున్నాయి.వీటిని స్వీక‌రించాల్సిన ద‌శ‌లో వైసీపీ ఉన్నా లేకున్నా చెప్పాల్సిందే ! ముఖ్యంగా ఆయ‌న ఇచ్చిన వ‌లంటీరు ఉద్యోగం కు సంబంధించి జీతం ఐదు వేలు. ఆ జీతంతో జీవితం మారిపోదు. పోనీ సెక్ర‌టేరియ‌ట్ పోస్టుల భ‌ర్తీ ఏమ‌యినా స‌రిగా చేశారా అంటే అదీ లేదు. అదీ చాలీచాల‌నీ వేత‌నాల‌తోనే అని టీడీపీ విమ‌ర్శిస్తోంది. ప్రొహిబిష‌న్ పిరియ‌డ్ క‌న్ఫం చేయ‌కుండా ఉద్యోగుల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతున్నార‌ని సంబంధిత వ‌ర్గాలు ఎన్నో సార్లు నెత్తీ నోరూ మోదుకుంటున్నాయి. ఇదే సంద‌ర్భంలో మ‌రిన్ని నిరుద్యోగ స‌మ‌స్య‌లూ ఉన్నాయి.

ముఖ్యంగా కానిస్టేబుల్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ లేదు.డీఎస్సీ లేదు. ఇంకా చెప్పాలంటే కీల‌క శాఖ‌లు అయితే కాంట్రాక్టు లేదా ఔట్ సోర్సింగ్ తోనే న‌డుస్తున్నాయి. ఈ ద‌శ‌లో రేపు కేసీఆర్ చేసే ప్ర‌క‌ట‌న త‌రువాత అయినా ఆంధ్రా సీఎం జ‌గ‌న్ స్పందిస్తారా లేదా అన్న ప్ర‌శ్న ఒక‌టి టీడీపీ వేస్తోంది. నిరుద్యోగిత నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకునే క్ర‌మంలో జ‌గ‌న్ వెనుకంజ వేయ‌డ‌మే కాకుండా ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు పెంచి, స‌మ‌స్య‌ను మ‌రింత జ‌ఠిలం చేశార‌న్న వాద‌న కూడా టీడీపీ నుంచి వ‌స్తోంది.ఏవి ఎలా ఉన్నా కేసీఆర్  ప్ర‌క‌ట‌న‌తో అయినా ఆంధ్రాలో క‌ద‌లిక వ‌స్తే అదే మేలు.

This post was last modified on March 9, 2022 8:12 am

Share

Recent Posts

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

24 minutes ago

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

1 hour ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

1 hour ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

2 hours ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

2 hours ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

3 hours ago