మాజీమంత్రి వివేకా హత్యకు సుపారీగా చెల్లించిన డబ్బును నిందితులకు ఎవరిచ్చారు? అంత మొత్తం ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందనే అంశాలపై సీబీఐ కొన్ని ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. వివేకాను అంతమొందిస్తే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి రూ. 40 కోట్లు ఇస్తారని… అందులో రూ. 5 కోట్లు తనకు ఇస్తారని ఎర్రగంగిరెడ్డి చెప్పినట్టు అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ ఆర్థిక మూలాలను లెక్కతేల్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉందని..సీబీఐ వర్గాలుచెబుతున్నాయి.
ఈ క్రమంలో వివేకా హత్యకు ముందు.. ఆ తర్వాత ఎంత మొత్తం చేతులు మారిందనే అంశంపై సీబీఐ దృష్టి సారించింది. నిందితులకు అడ్వాన్సుగా చెల్లించిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి వెనుకున్న ఆర్థిక మూలాలపై కొన్ని ఆధారాలు సేకరించింది. ఈ నేపథ్యంలో ఈ హత్య కేసును సీబీఐ అధికారులు… లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
హత్యకు సుపారీ డబ్బును నిందితులు ఎవరికి ఇచ్చారు? ఆ నగదు ఎలా వచ్చిందనే అంశాలపై సీబీఐ దృష్టి పెట్టింది. దీనికి… కొన్ని ఆధారాలు సేకరించినట్లు సమాచారం. వివేకా హత్య కుట్ర 2019 ఫిబ్రవరి 10న ఎర్ర గంగిరెడ్డి ఇంట్లోనే జరిగిందని.. దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. తర్వాత నాలుగు రోజులకు సునీల్ యాదవ్.. కోటి రూపాయలు తీసుకొచ్చి సుపారీ అడ్వాన్సుగా ఇచ్చారని దస్తగిరి తెలిపాడు.
అయితే ఆ డబ్బులు సునీల్ యాదవ్‌కి ఎవరిచ్చారు? వాళ్లకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే అంశా లపై సీబీఐ ఇప్పటికే ఆరాతీసింది. సుపారీ సొమ్ము మూలాలు తెలిస్తే కుట్రదారులెవరో తేలిపోతుందని సీబీఐ భావిస్తోంది. వివేకాని చంపేయ్.. మేమూ నీతో వస్తాం. దీని వెనుక ఎంపీ వై.ఎస్.అవినాష్‌రెడ్డి, వై.ఎస్.మనోహర్‌రెడ్డి, వై.ఎస్.భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి వంటి పెద్దవాళ్లున్నారంటూ.. ఎర్రగంగిరెడ్డి తనతో చెప్పారని దస్తగిరి వాంగ్మూలంలో వివరించారు. దస్తగిరితో ఎర్రగంగిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు, సుపారీ సొత్తుకు ఎలాంటి సంబంధం ఉంది? మిగతా నిందితులైన ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌లకు అడ్వాన్సు అందిందా? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అనే కోణంలో సీబీఐ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. వివేకానందరెడ్డి హత్యకు ముందు..తర్వాత ఎంత మొత్తం చేతులు మారాయనే అంశంపై సీబీఐ అధికారులు దృష్టి పెట్టారు.
This post was last modified on March 7, 2022 1:33 pm
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…