తెలంగాణలో తిరిగి పుంజుకోవడం కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సారథ్యంలో పునర్వైభవం సాధించాలని చూస్తోంది. కానీ టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఎంపిక దగ్గర నుంచి పార్టీలోని ఓ సీనియర్ నేతల వర్గం ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ విషయం అధిష్ఠానం దృష్టికి వెళ్లడం.. హై కమాండ్ సరిదిద్దే చర్యలు చేపట్టినా ఎలాంటి మార్పులేదు. ఓ వైపు సీనియర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా రేవంత్ తనదైన దూకుడుతో సాగుతున్నారు.
పార్టీని ప్రజల్లో ఉంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులే తప్పుపట్టడం గమనార్హం. తెలంగాణలో బిహారీల రాజ్యం నడుస్తుందని అఖిల భారత సర్వీసు ఉద్యోగుల్లో అత్యధిక శాతం వాళ్లే ఉన్నారని రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కానీ బిహార్ ఐఏఎస్ అధికారులపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ తప్పు పట్టారు.
తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని దేశం కాదని ఇక్కడ పనిచేసే అధికారం అన్ని ప్రాంతాల ఐఏఎస్ అధికారులకు ఉంటుందని చెప్పారు. కేసీఆర్ చేసే డైవర్షన్ పాలిటిక్స్ ట్రాప్‌లో పడకూడదని, ఆయనపై పోరాటం ఉండాలని సూచించారు. సీఎంగా ఎవరు ఉంటే వాళ్ల మాటలనే అధికారులు వింటారని తెలిపారు. ఇతర రాష్ట్రాల అధికారులు అనడం సరికాదని రేవంత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు కూడా రేవంత్ మాటలను తప్పుపట్టారు. బిహార్‌లోనూ కాంగ్రెస్ ఉంది కదా? అలా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు.
మరోవైపు కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం మన ఊరు- మన పోరు పేరుతో రేవంత్ కార్యక్రమాన్ని చేపట్టారు. బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టే బహిరంగ సభలతో లాభం లేదని మధుయాష్కీ వ్యాఖ్యానించడం గమనార్హం. గ్రామస్థాయిలో రచ్చబండపై కూర్చుని మాట్లాడితే ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలా గ్రామాల్లో తిరగాలన్నారు. దీంతో తమ పార్టీపై ఎవరైనా విమర్శలు చేస్తే తిరిగి కౌంటర్ ఇవ్వాలన్ని నేతలు.. ఇలా సొంత పార్టీ నాయకుడిపైనా వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on March 7, 2022 8:11 am
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…