వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి అక్షరాలా 1000 రోజులు అయింది. ఒక్క ఛాన్స్ అంటూ.. 2019లో ఏపీ ప్రజలకు ఆయన చేసిన విన్నపాల ఫలితంగా దేశంలోని ఏ రాష్ట్ర ప్రజలు.. ఏ పార్టీకి కట్టబెట్టనటువంటి స్థాయిలో అనూహ్యమైన మెజారిటీతో 151 మంది ఎమ్మెల్యేలతో ఆయనకు అధికారం ఇచ్చారు.
మరి ఇంత భారీ విజయాన్ని అది కూడా తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా సాధిం చని విజయాన్ని సాధించిన జగన్.. ఈ మేరకు ఈ వెయ్యి రోజుల్లో ప్రజల మనసు గెలుచుకోగ లిగారు..? ఏమే రకు రాష్ట్రాన్ని ఆదర్శంతంగా నిలిపారు? ఏమేరకు .. ఆయన పాలనలో సరికొత్త సరిగమ లు పలికించారు? అనేది ఆసక్తికర విషయం.
వలం ఆరు మాసాల్లోనే ఉత్తమ ముఖ్యమంత్రి అని అనిపించుకుంటా!
అంటూ.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఆయన వెల్లడించారు. అయితే.. ఇప్పటికి 33 మాసాలు పూర్తయి నా.. ఈ తరహా ఆలోచన ప్రజల్లో ఆయన కల్పించలేక పోయారనే వాదన వినిపిస్తోంది. ప్రధానంగా మూడు విషయాలను ఆధారంగా చేసుకుని ఆయన స్వపరిపాలనకు శ్రీకారం చుట్టారని అంటున్నారు పరిశీలకులు. ఒకటి.. ప్రతిపక్షాన్ని లేకుండా చేయడం. రెండు.. ఏకఛత్రాధిపత్య నిర్ణయాలు తీసుకోవడం, మూడు.. మేనిఫెస్టోలో చెప్పి సంక్షేమానికి పెద్దపీట వేయడం. ఈ అంశాలనే జగన్ ఆధారం చేసుకుని పాలన సాగించారు.
ఫలితంగా.. వెయ్యి రోజులు గడిచిపోయినా.. వీసమెత్తు కూడా జగన్ గ్రాఫ్ పెంచుకోలేక పోయారనే వాదన వినిపిస్తోంది. తొలి విషయాన్ని తీసుకుంటే.. టీడీపీ నేతలపై కత్తికట్టారనేది ప్రత్యక్షంగా కనిపించిన వాస్తవం. పార్టీ మారేలా ప్రోత్సహించడం.. పార్టీ మారకపోతే.. కేసుల కత్తి ఎత్తడం మామూలుగా మార్చుకున్నారు. ఫలితంగా కొందరు పార్టీ మారినా.. మరికొందరు తెగించి జైలుకు వెళ్లారు. మాజీ మంత్రులు.. మాజీ ఎమ్మెల్యేలపైనా.. జగన్ ప్రభుత్వం కేసులు పెట్టింది. అదే సమయంలో చంద్రబాబును వ్యక్తిత్వ హననానికి కూడా పునుకున్నది. మరోవైపు.. ప్రభుత్వాన్ని విమర్శించేవారిపైనా సోషల్ మీడియా చట్టాలను ప్రయోగించి కేసులు పెట్టారు.
ఇంకోవైపు.. తమకు అనుకూలంగానే మీడియాలు పనిచేయాలనే ధోరణిని చాన్నాళ్లు అవలంభించారు. ఆఖరుకు న్యాయ వ్యవస్థ వంటివాటిని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసి.. బోల్తా కొట్టారు. ఇక, రెండో విషయానికివస్తే.. ఏకపక్ష నిర్ణయాలు. అవి ప్రజలకు మేలు చేస్తాయా? లేదా.. అనే విషయాన్ని పక్కన పెట్టి.. కొల్ల బోతున్న ఖజానాను నింపుకొనే ప్రయత్నంలో ఓటీఎస్, చెత్తపై పన్ను, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడం.. పెట్రోల్ ధరలను పెంచడం.. వంటి నిర్ణయాలతో పేదలు, మధ్యతరగ తి వర్గాన్ని తీవ్రస్థాయిలో ఇబ్బందులు పెట్టారు. పెడుతున్నారనే వాదన వినిపిస్తోంది.
ఇక, మూడో విషయానికి వస్తే.. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు సంక్షేమానికి పెద్ద పీట అంటూ.. వచ్చిన డబ్బులు వచ్చినట్టు ప్రజలకు పంచేస్తున్నారు. సంక్షేమం మంచిదే అయినా.. రాష్ట్రాన్ని ముందుకు సాగించే వ్యూహాలు.. అభివృద్ధి పంథాలను విస్మరించడం.. అమరావతిని తొక్కేసి.. మూడు రాజధానుల అజెండాను ముందుకు తీసుకురావడం.. కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే హోదాను తీసుకువస్తామని చెప్పినా.. ఇప్పటి వరకు ఒక్కడ అడుగు కూడా ముందుకు వేయకపోవడం.. వంటివి వెయ్యి రోజుల జగన్ పాలనను వెక్కిరిస్తున్నాయనే చెప్పాలి.
ఇక, ప్రజలకు-ప్రజాప్రతినిధులకు మధ్య ఈ వెయ్యిరోజుల్లో ఎలాంటి సంబంధాలు లేకుండా పోయాయనే చెప్పాలి. ఎక్కడికక్కడ అవినీతి లేకుండా చేస్తానని.. చెప్పినా.. ఇసుక, మట్టి మాఫియాలను అరికట్టలేని పరిస్థితిలో జగన్ సర్కారుకు కూరుకుపోయిందనేది వాస్తవం. అదేవిధంగా అతి తెలివితో తీసుకుంటున్న నిర్ణయాలు కూడా సర్కారుకు చెంపపెట్టుగా మారిపోతున్నాయి. వెరసి.. వెయ్యి రోజుల పాలన.. జగన్‌కు అధికార దర్పాన్ని పెంచిందే తప్ప.. ప్రజలకు , రాష్ట్రానికి ఒరిగింది ఏమీలేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on March 6, 2022 1:48 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…