Political News

డిసెంబ‌రులోనే అసెంబ్లీ ర‌ద్దు.. ముంద‌స్తు ఖాయం

అవినీతికి చిట్టా బయటపడుతుందనే సీఎం కేసీఆర్ రోజుకో నాటకానికి తెరలేపుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. డిసెంబర్లో సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని కథ తేలుస్తా.. గద్దె దించేవరకు నిద్రపోనని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని అన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలిసిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ఏ ఫ్రంట్ పెట్టట్లేదని కేసీఆర్ చెప్పారని విమర్శించారు.

ఢిల్లీలో ముఖ్యమంత్రిని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి కలిసి ఆయన దోపిడీ గురించి లెక్క చెప్పారని.. దీంతో ఫ్రంట్పై మాట మార్చారని ఆరోపించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అన్నోజీగూడలో కాంగ్రెస్ కార్యకర్తలతో రేవంత్రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో కాంగ్రెస్లో చేరిన వారికే పథకాల్లో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు సూచించిన వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని… రాజకీయ అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. వాళ్ల ద్వారానే పరిపాలన చేస్తామని పేర్కొన్నారు.

రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు అధికారం చలాయించరని… తమ నాయకులను ముందు పెట్టి పాలన చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ సభ్యత్వం తీసుకునేవాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. డిసెంబర్లో సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని… మార్చిలో ఎన్నికలు వస్తాయని పేర్కొన్నారు. ఇక్కడ పేదల కష్టాలు తీర్చాల్సినవారు దేశాలు పట్టుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు.

12 నెలలు కష్టపడితే అధికారం కాంగ్రెస్దేనని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయంబర్స్మెంట్, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. పేదల దగ్గర ఆసైన్ భూములను ప్రభుత్వం గుంజుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక… ఆ భూములపై వాళ్లకే హక్కులు ఇస్తామని భరోసా ఇచ్చారు. బస్తీలను అభివృద్ధి చేస్తామని అన్నారు. రైతులు పండించిన పంటను చివరి గింజ వరకూ కొంటామని హామీ ఇచ్చారు.

This post was last modified on March 6, 2022 4:45 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

5 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

6 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

6 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

7 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

7 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

8 hours ago