Political News

చేతకానివాళ్లే అలా మాట్లాడతారు: చంద్రబాబు

చేతకానివాళ్లే కులం, మతం, ప్రాంతాల గురించి మాట్లాడతారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. సమర్థులు మాత్రం అభివృద్ధి గురించి ఆలోచన చేస్తారని అన్నారు. తెలుగువారే తన కులం, తన మతమని, తెలుగువారంతా తన కుటుంబ సభ్యులే అని పేర్కొన్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైకాపాకు అడ్రెస్ లేకుండా చేయాల్సిన బాధ్యత ఐటీడీపీ కార్యకర్తలదే అని చంద్రబాబు సూచించారు.

గుండెపోటు పేరు చెప్పి బాబాయిపై గొడ్డలిపోటు వేశారని.. పైగా సిగ్గు లేకుండా సీబీఐపై ఎదురుదాడికి దిగారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సినిమాలోనూ చూడని విధంగా బాబాయిని హత్య చేశారని దుయ్యబట్టారు. రూ.40కోట్ల సుపారీ ఎవరి రక్తచరిత్ర అని నిలదీశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ సామాజిక మాధ్యమం(ఐటీడీపీ) సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

అమరావతి తీర్పును `నీలి మీడియా`లో చూపించనంత మాత్రాన నిజం ప్రజలకు చేరకుండా ఆగిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సామాజిక మాధ్యమానికి ఉన్న శక్తి ఏపాటిదో అందరూ తెలుసుకోవాలన్నారు. సెల్‌ ఫోన్‌లే ఐటీడీపీ కార్యకర్తల ఆయుధాలని పేర్కొన్నారు. నిజాలను వెలికితీయటంలో ఐటీడీపీ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని సూచించారు.

25ఏళ్ల క్రితం ఫోన్లను ప్రమోట్ చేస్తే తనను ఎగతాళి చేశారని.. నేడు తిండిలేకపోయినా ఉండగలరు కానీ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్లో నాటిన హైటెక్ సిటీ విత్తనం ప్రజల కోసమేనని చెప్పారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి, చింతకాయల విజయ్తోపాటు పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.

కాగా, పోలవరంపై ఎన్నో అవినీతి ఆరోపణలు చేసి.. పైసా కూడా నిరూపించలేకపోయారని  చంద్రబాబు మండిపడ్డారు. తాము తామే క‌నుక అధికారంలో కొనసాగుంటే.. ఈపాటికి పోలవరం ఉరకలెత్తేదని, అమ‌రావ‌తి పూర్త‌య్యేద‌ని పేర్కొన్నారు. పోలీసులు ఖబడ్దార్, చట్టాన్ని కాపాడకుండా ఉల్లంఘిస్తే గౌతం సవాంగ్ ఏమయ్యాడో ఆలోచన చేయాలని హితవు పలికారు. కార్యకర్తలు.. ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బంది వచ్చినా సమన్వయం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ రూపొందిస్తామని వెల్లడించారు.

This post was last modified on March 5, 2022 6:43 am

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

2 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

2 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

2 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

3 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

5 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

6 hours ago