పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో దశ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సారి బడ్జెట్ సమావేశాలను రెండు దశలుగా నిర్వహి స్తున్నారు. ఇప్పటికే తొలిదశ ఫిబ్రవరిలో పూర్తి అయింది. ఈ నేపథ్యంలో మార్చిలో రెండో దశ సమావేశాలు నిర్వహించనున్నా రు. అయితే.. రెండో దశ సమావేశాలకు సంబంధించి వైసీపీలో తీవ్ర అంతర్మథనం జరుగుతోంది. ఎందుకంటే.. తొలి దశ సమావే శాల్లో ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీ విభజనపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఏపీని అక్రమంగా అన్యాయంగా పార్లమెంటు తలుపులు మూసి విభజించారని.. మిరియాల కారం పార్లమెంటు సభ్యుల కళ్లలో చల్లారని.. కూడా మోడీ పేర్కొన్నారు.
ఈ కారణంగానే ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. కట్ చేస్తే.. మోడీ అంతటివాడే.. ఇంత మాట చెప్పాక.. విభజనతో నష్టపోయిన.. ఏపీకి న్యాయం చేయాలంటూ.. పార్లమెంటులో వైసీపీ ఎంపీలు 28 మంది నిలదీయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. మాజీ ఎంపీ.. ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇప్పటికే ఈ విషయంపై మీడియా మీటింగులు పెట్టి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇంత మంది ఎంపీలుఉండి ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికైనా.. పార్లమెంటులో నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో త్వరలోనే జరగనున్న పార్లమెంటు రెండో దశ సమావేశాల్లో వైసీపీ అనుసరించే వ్యూహాలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత.. ఈ విభజన అంశాలపై చర్చించేందుకు ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. దీనిలో విభజన అంశాలను చర్చించి పరిష్కరించేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన అజెండాలో.. తొమ్మిది అంశాలను ప్రస్తావించారు. దీనిలో ప్రధానంగా ప్రత్యేక హోదా అంశాన్ని కూడా పేర్కొనడం.. అందరినీ ఆనంద పరిచింది. ఇంతలోనే..ఏం జరిగిందో ఏమో.. అజెండా నుంచి హోదా అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. దీంతో అప్పటి వరకు ఉన్న ఆనందం చల్లారిపోగా.. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వైసీపీకి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలి? హోదా అంశంపై ఎలా నిలదీయాలనే విషయం.. వైసీపీని సుడిగుండంలోకి నెట్టేసిందని అంటున్నారు పరిశీలకులు. హోదా అంశాన్ని సీఎం జగన్ సీరియస్‌గా తీసుకున్నారని.. కేంద్రంతో ఈ విషయాన్ని తేల్చుకునేందుకురెడీ అవుతున్నారని సీనియర్లు చెబుతున్నారు. అయితే.. నేరుగా మోడీతో తలపడితే.. ప్రమాదమనే సంకేతాలు కూడా ఉన్నాయి. అలాగని మౌనంగా ఉంటే.. వచ్చిన అవకాశం చేజారి పోతుందని. ఆయన కూడా బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. ప్రస్తుతం హోదాపై నిలదీయాలా వద్దా.. అనే విషయం వైసీపీలో చర్చనీయాంశంగా మారిపోయింది. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on February 27, 2022 9:20 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…