రష్యాను ఎదిరించే ధైర్యం ప్రపంచంలో ఏ దేవానికి లేదా ? ఇపుడిదే విషయమై చర్చ పెరిగిపోతోంది. రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ అనేది చాలా చిన్నదేశం. ఏ విధంగా తీసుకున్నా ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య లేదా యుద్ధానికి దిగటం ఆమోదయోగ్యం కానేకాదు. కానీ ప్రపంచదేశాలతో సంబంధం లేకుండానే తన సొంతప్రయోజనాలే లక్ష్యంగా రష్యా యుద్ధానికి దిగేసింది. రష్యా దెబ్బకు ఉక్రెయిన్ ఇపుడు విలవిల్లాడుతోంది.
యుద్ధం ఆరంభానికి ముందు నాటో (నాన్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్)దేశాల కూటమి కూడా ఉక్రెయిన్ను బాగా రెచ్చగొట్టింది. వీటి మద్దతు చూసుకునే ఉక్రెయిన్ కూడా రష్యాపై రెచ్చిపోయింది. ఇపుడు దాని ఫలితం అనుభవిస్తోంది. సరే ఉక్రెయిన్ సంగతిని పక్కన పెట్టేస్తే మరి నాటో ఎందుకని వెనక్కు తగ్గింది. ముందేమో ఉక్రెయిన్ను బాగా రెచ్చగొట్టి చివరకు ఎందుకని వెనక్కు తగ్గింది ? చూస్తుంటే రష్యా అంటే భయంవల్లే నాటో దేశాలు ఉక్రెయిన్ కు మద్దతు ఉపసంహిరించుకున్నట్లు అర్ధమవుతోంది.
నాటో దేశాలంటే దేనికో భయపడ్డాయని అనుకోవచ్చు. మరి ఐక్యా రాజ్యసమితికి ఏమైంది ? యుద్ధం మొదలు కాకముందు ఏ దశలో కూడా యుద్ధ నివారణకు ఐక్య రాజ్యసమితి సీన్లోకి ఎంటరైనట్లు ఎక్కడా కనబడలేదు. యుద్ధం ఆరంభమైన రెండోరోజు సమితి సన్నాయినొక్కులు నొక్కుతోంది. ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తు భద్రతామండలిలో ఒక తీర్మానం చేసి చేతులు దులిపేసుకుంది.
నిజంగా సమితి కూడా ఉక్రెయిన్ కు అన్యాయం చేసిందనే చెప్పాలి. బలహీన దేశానికి ఐక్య రాజ్యసమితి మద్దతుగా నిలవాల్సింది. కానీ యుద్ధమేఘాలు కమ్ముకునేంత వరకు వివాదంలో జోక్యం చేసుకోలేదు. ఇపుడు కూడా భద్రతా మండలిలో రష్యా వైఖరిని ఖండించి చేతులు దులిపేసుకుంటే ఉపయోగం ఏమిటి. దేశాధినేతలతో కమిటిని వేసి యుద్ధాన్ని ఆపేట్లుగా రష్యాపై ఒత్తిడి తేవాలి. లేకపోతే ఉక్రెయిన్ దారుణంగా దెబ్బతినటం ఖాయం.
This post was last modified on February 26, 2022 1:06 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…