నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా జాతీయ స్ధాయిలో కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు అందరు చూస్తున్నదే. కొందరితో ఫోన్లో మాట్లాడారు మరికొందరిని నేరుగా కలిశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో భేటీ అయ్యారు.
మొదటి నుండి జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అవసరం లేకుండానే కొత్త వేదిక ఏర్పాటు చేయాలని కేసీఆర్ చెబుతునే ఉన్నారు. దీనికి తాజాగా కేసీఆర్ ప్లాన్ అంటు ఒక సమాచారం బయటకు పొక్కింది. అదేమిటంటే కేవలం ప్రాంతీయ పార్టీలతోనే బలమైన వేదికను ఏర్పాటు చేయాలన్నది కేసీయార్ ప్లానట. అంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై ఒక ఫ్రంట్ గా ఏర్పడితే రెండు జాతీయ పార్టీలను ధీటుగా ఎదుర్కోవచ్చనేది కేసీయార్ ఆలోచనగా ఉంది.
తమిళనాడులో ఈ మధ్యనే డీఎంకే అధికారంలోకి వచ్చింది. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అధికారంలో ఉంది. కర్నాటకలో జేడీఎస్ ప్రతిపక్షంలో ఉంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఈ మధ్యనే అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీటిల్లో ప్రాంతీయ పార్టీలతో మాత్రమే వేదికను ఏర్పాటు చేయాలని కేసీయార్ అనుకుంటే ఎన్ని పార్టీలు కలిసొస్తాయో అనుమానమే. ఎందుకంటే ప్రస్తుతం డీఎంకే యూపీఏ కూటమిలో ఉంది. దీనికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది.
అలాగే మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే గనుక కేసీయార్ తో చేతులు కలిపితే సంకీర్ణ ప్రభుత్వం పడిపోయే అవకాశముంది. కాంగ్రెస్ సహకారం లేకుండా మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం నడవలేదు. ఇక బెంగాల్లో దీదీ సంగతంటారా ఆమె రూటే సపరేటు. ప్రత్యామ్నాయ వేదికకు తానే నేతృత్వం వహించాలని, ప్రధానమంత్రి అభ్యర్ధిగా తానే ఉండాలని మమత కోరుకుంటున్నారు. కాబట్టి కేసీయార్ అయినా మరొకరి నాయకత్వాన్నైనా దీదీ అంగీకరించే అవకాశం తక్కువ. ఎందుకంటే ప్రస్తుత సీఎంల్లో సీనియర్ మోస్ట్, మూడోసారి సీఎం అయ్యింది మమతానే. కాబట్టి కేసీయార్ ప్లాన్ ఎంతవరకు అమలవుతుందో చూడాల్సిందే.
This post was last modified on February 23, 2022 10:28 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…