Political News

ప్రకాశ్ రాజ్‌, కేసీఆర్.. ఎవరి బుట్టలో ఎవరు పడుతున్నారు?

తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలిసినప్పటి నుంచి ఓ వార్త మీడియాలో కనిపిస్తుంది. ప్రకాశ్ రాజ్‌ను కేసీఆర్ రాజ్యసభకు పంపిస్తారన్న ఊహాగానాలు మీడియాలో వినిపిస్తున్నాయి. నరేంద్ర మోదీని ఎలాగైనా దించేస్తానంటూ కాలికి బలపం కట్టుకుని రాష్ట్రాలు తిరుగుతున్న కేసీఆర్ చిత్తశుద్ధి ఎలా ఉందో ఏమో కానీ ఈ ప్రయాణంలో కేసీఆర్ వెంట కనిపిస్తున్న నటుడు ప్రకాశ్ రాజ్ చిత్తం మాత్రం మాత్రం వేరే లక్ష్యంపై ఉందని వినిపిస్తోంది.

ఎందుకో తెలియదు కానీ పార్లమెంటులో అడుగుపెట్టడానికి ప్రకాశ్ రాజ్ చాలాకాలంగా ఉవ్విళ్లూరుతున్నారు. ఆ క్రమంలో ఆయన మేధావి, బహుభాషా కోవిదుడు లాంటి ఇమేజ్‌లు సంపాదించుకున్నారు. ఆ తరువాత తన ఫాం ల్యాండ్ పక్కన గ్రామాన్ని దత్తత తీసుకుని సేవా తత్పరుడి ఇమేజ్‌ను, సామాజిక అంశాలపై స్పందిస్తూ యాక్టివిస్ట్ ఇమేజ్‌నూ సంపాదించుకున్నారు. ఇవన్నీ ఒక్కటొక్కటిగా సంపాదిస్తూనే బీజేపీ, మోదీపై వ్యతిరేకతను చాటుకుంటూ జాతీయ స్థాయిలో అప్పుడప్పుడూ గళం విప్పుతున్నారు. కర్ణాటక ఎన్నికలలోనూ, తెలుగునాట మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లోనూ గెలవాలని ప్రయత్నాలు చేసి విఫలమవడంతో ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదని అర్థం చేసుకున్న ప్రకాశ్ రాజ్ రాజ్య సభ అయితే పార్లమెంటులో అడుగుపెట్టడం తనకు సులభమని గ్రహించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఆ క్రమంలో ఆయనకు అందివచ్చిన అవకాశమే కేసీఆర్. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడం… ఇంతకుముందు రెండు టర్ముల్లా కాకుండా బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి గట్టి పోటీ ఉండడంతో కేసీఆర్ రాజకీయ ఎత్తులు, జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతానంటూ బీజేపీని బెదిరించే యత్నాల్లో భాగంగా ప్రగల్భాలు, ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలు, సీఎంలతో భేటీలతో హడావుడి చేస్తున్నారు. ఇది ప్రకాశ్ రాజ్‌కు కోరికలను దౌడు తీయించే గుర్రంలా దొరికిందని తెలుస్తోంది. దక్షిణాది సినిమా రంగంతో పాటు ముంబయిలోనూ మంచి సంబంధాలున్న ప్రకాశ్ రాజ్ ఇతర రాష్ట్రాల్లో తెరాస నేతలకు సంధానకర్తగా పనిచేస్తున్నారని… ఆయన్ను రాజ్యసభకు పంపేందుకు కేసీఆర్ అంగీకరించారని రెండు రోజులుగా వినిపిస్తోంది. బీజేపీ వ్యతిరేక భావజాలంతో దేశవ్యాప్తంగా ఆయ‌న‌ ఇప్పటికే గుర్తింపు తెచ్చుకోవడంతో దిల్లీలో టీఆర్ఎస్ వాయిస్‌గా ఆయన్ను వాడుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నారనీ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే త్వర‌లో తెలంగాణలో ఖాళీ కానున్న మూడు రాజ్యస‌భ స్థానాల‌లో ఒకటి ప్రకాశ్ రాజ్‌కు ఇవ్వనున్నట్లు వినిపిస్తోంది.

బండ ప్రకాశ్‌ రాజీనామాతో ఒక రాజ్యసభ స్థానం ఖాళీగా ఉండగా.. జూన్‌లో మరో ఇద్దరు డీఎస్‌, కెప్టెన్ లక్ష్మీకాంతరావుల పదవీకాలం ముగియనుంది. దీంతో ఈ మూడు స్థానాలు టీఆర్ఎస్‌కే దక్కనున్నాయి. ఇందులో ఒక స్థానాన్ని ప్రకాశ్‌రాజ్‌కు ఇచ్చే యోచనలో గులాబీ బాస్‌ ఉన్నట్లు టీఆర్ఎస్‌ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా గ‌ళం విప్పుతున్న ప్రముఖుల్లో ప్రకాశ్ రాజ్ ఒక‌రు. తొలి విడ‌త ఎన్డీయే స‌ర్కార్ ఏర్పడిన తర్వాత సైద్ధాంతికంగా ఆ పార్టీ విధానాల‌ను విభేదిస్తున్నారు. రాజ‌కీయాల్లో క్రియాశీలంగా లేకపోయినా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న న‌టుడు కావ‌డంతో ఆయ‌న చేసిన వ్యాఖ్యలు మీడియాను ఆకర్షిస్తుంటాయి. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు నుంచి గులాబీ పార్టీతో ట‌చ్‌లో ఉన్న ప్రకాశ్ రాజ్ ఆ సంబంధాలు అదే విధంగా కొన‌సాగిస్తున్నారు.

2019 పార్లమెంట్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ దేశంలో గుణాత్మక మార్పు నినాదాన్ని అందుకోవ‌డంతో.. అప్పుడు గులాబీ బాస్‌కు ప్రకాశ్‌రాజ్ మద్దతు తెలిపారు. తాజాగా ముంబై ప‌ర్యట‌న‌లో మ‌రోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వాగ‌తం ప‌లక‌డం, ఉద్దవ్‌ ఠాక్రేతో భేటీ అయిన టీమ్‌లో ప్రకాశ్‌రాజ్‌ ఉండటం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌తో ప్రకాశ్‌రాజ్‌.. మూడేళ్లుగా స‌న్నిహితంగా మెలుగుతున్నారు. గతంలో గులాబీబాస్ క‌ర్ణాటకలో ప‌ర్యటించి మాజీ ప్రధాని దేవ‌గౌడతో భేటీ అయిన సందర్బంగా ప్రకాశ్‌రాజ్‌ ఉన్నారు. ముఖ్యమంత్రి బ‌యోపిక్ తీస్తార‌ని గ‌తంలో ప్రచారం జ‌రిగిన స‌మ‌యంలోనూ వ‌రుస‌గా కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా పలుమార్లు ముఖ్యమంత్రి వెంటే వ‌చ్చి ప‌రిశీలించారు.

వీటన్నిటితో పాటు ప్రస్తుతం దళిత అజెండాతో ముందుకెళ్తున్న కేసీఆర్ ప్రకాశ్ రాజ్‌ను ఆ కోణంలోనూ వాడుకునేందుకు చూస్తున్నారని వినిపిస్తోంది. అయితే, చివరి క్షణం వరకు తెచ్చి హ్యాండివ్వడంతో అందె వేసిన చేయి అయిన కేసీఆర్ ప్రకాశ్ రాజ్ మనసులోని ఆశలను ఎంతవరకు నెరవేరుస్తారో చూడాలి. ఒకవేళ రాజ్యసభ సీటిచ్చి ఆయన ఆశలు నెరవేరిస్తే ప్రకాశ్ రాజ్ కేసీఆర్‌కు ఎంతవరకు పనికొస్తారన్నదీ అనుమానమే. కారణం…. రాజ్యసభకు వెళ్లేందుకు కేసీఆర్ ఆయనకు ఒక నిచ్చెన అవుతారే కానీ కేసీఆర్ అజెండా మాత్రం ప్రకాశ్ రాజ్ అజెండా కాదు. కేసీఆర్ రాజకీయ అజెండాను ప్రకాశ్ రాజ్ మోయబోరని… తనకు పదవి వచ్చాక తనదైన హిందూ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక అజెండా కోసమే పనిచేస్తారని బీజేపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే కేసీఆర్ బుట్టలో ప్రకాశ్ రాజ్ పడ్డారా? ప్రకాశ్ రాజ్ బుట్టలో కేసీఆర్ పడుతున్నారా అనేది ఆసక్తికరమైన ప్రశ్నే.

This post was last modified on February 22, 2022 10:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

6 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

8 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

9 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

10 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

10 hours ago