Political News

కేసీఆర్ ముంబై టూర్లో ప్ర‌కాశ్ రాజ్ ఎందుకున్నారు?

జాతీయ రాజ‌కీయాల్లో చక్రం తిప్పాల‌ని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మేర‌కు త‌నదైన శైలిలో ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న శివ‌సేన ర‌థ‌సార‌థి, మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ఠాక్రే అధికార నివాసమైన ‘వర్ష’కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న బృందంతో ఆదివారం మ‌ధ్యాహ్నం చేరుకున్నారు. లంచ్ అనంత‌రం ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశానికి సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కూడా హాజ‌ర‌వ‌డం కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపింది.

ఈ సందర్భంగా భవిష్యత్‌ రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలతో పాటు కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌పై చర్చిస్తున్నారు. ఈ స‌మావేవం ముగిసిన అనంత‌రం అనంతరం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను కేసీఆర్ క‌ల‌వ‌నున్నారు. మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వెంట ఎంపీలు సంతోష్‌ కుమార్‌, రంజిత్‌ రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఉన్నారు. అయితే, ఈ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌కాశ్ రాజ్ ఉండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ హైద‌రాబాద్ నుంచి ముంబైకి బ‌య‌ల్దేరిన స‌మ‌యంలో ప్ర‌కాశ్ రాజ్ ఆయ‌న వెంట లేరు. ముంబై విమాన‌శ్ర‌యంలో ప్ర‌కాశ్ రాజ్ కేసీఆర్ క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న‌వెంట వ‌చ్చిన వారిని కేసీఆర్ ఆయ‌న‌కు పరిచ‌యం చేశారు.

గ‌తంలో మాజీ ప్ర‌ధాని, జేడీఎస్ అధినేత దేవేగౌడ‌ను క‌లిసేందుకు క‌ర్ణాట‌క వెళ్లే స‌మ‌యంలో కూడా ప్ర‌కాశ్ రాజ్‌ను కేసీఆర్ వెంట‌తీసుకువెళ్లారు. అయితే, ప్ర‌కాశ్ రాజ్‌కు క‌ర్ణాట‌కలో ప‌రిచ‌యాలు ఉండ‌టం వ‌ల్ల వెంట‌బెట్టుకు వెళ్లార‌ని భావించారు. మ‌రి ముంబై టూర్‌కు తీసుకువెళ్ల‌డం ఏంట‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌కాశ్‌రాజ్‌కు ఉన్న సినీ గ్లామ‌ర్‌ను ఉప‌యోగించుకునేందుకు ఠాక్రే మీటింగ్‌కు ఆహ్వానించార‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. అయితే, ప్రకాశ్ రాజ్ లేకుండా కేసీఆర్ జాతీయ రాజ‌కీయాలు చేయ‌లేరా అంటూ మ‌రికొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

This post was last modified on February 20, 2022 7:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ పుట్టిన రోజు.. డబుల్ ధమాకా?

మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…

6 hours ago

2027లో జగన్ 2.0 పాదయాత్ర అంట!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…

7 hours ago

యుద్ధ స‌న్న‌ద్ధం:  రాష్ట్రాల‌కు కేంద్రం సంచ‌ల‌న ఆదేశాలు

భార‌త్‌-పాకిస్థాన్ ల మ‌ధ్య పెరుగుతున్న ఉద్రిక్త‌త‌లు ఏ క్ష‌ణ‌మైనా యుద్ధానికి దారితీయొచ్చ‌ని ర‌క్ష‌ణ రంగ నిపుణులు చెబుతు న్న స‌మ‌యంలో…

7 hours ago

ఇక తెలుగుదేశంలో ‘ ఏఐ ‘ హ‌వా మొద‌లైందా…!

తెలుగు దేశం పార్టీ నిర్వ‌హించే ప‌సుపు పండుగ మ‌హానాడుకు ఏర్పాట్లు ప్రారంభ‌మ‌య్యాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో…

10 hours ago

‘సిరివెన్నెల’కు న్యాయం చేయలేకపోయా – త్రివిక్రమ్

సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్‌కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…

10 hours ago

వీరమల్లు వస్తే ఎవరికి టెన్షన్

హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…

11 hours ago