కేంద్రంలోని బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసం కేసీయార్ ముంబాయ్ లో బిజీ బిజీగా ఉండబోతున్నారు. ఆదివారం ఉదయానికి కేసీయార్ ముంబాయ్ చేరుకుంటారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్థవ్ థాక్రే ఆహ్వానం మేరకు కేసీయార్ ముంబాయ్ వెళుతున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి అని చెబుతున్నప్పటికి ఇది పక్కాగా నరేంద్రమోడి వ్యతిరేక కూటమనే అనుకోవాలి. ఎందుకంటే మోడి బాడీలాంగ్వేజ్ తోనే చాలామంది విభేదిస్తున్నారు.
మధ్యాహ్నం థాక్రే ఇంట్లో లంచ్ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ లో జాతీయ రాజకీయాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతంది. ఎన్డీయేయేతర, యూపీయేయేతర పార్టీలను ఏకతాటిపైకి తేవటమే ప్రధాన అజెండాగా వీళ్ళ సమావేశం ఉండబోతోంది. పనిలోపనిగా గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలని అనుకుంటున్న వార్ధా ప్రాజెక్టుపైన కూడా చర్చ జరుగుతుంది. దాదాపు రెండున్నర గంటపాటు వీళ్ళ భేటీ జరిగే అవకాశముందని సమాచారం.
తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కూడా కేసీయార్ కలవబోతున్నారు. వీళ్ళమధ్య కూడా బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుపైనే చర్చలు జరుగుతాయి. ఒకవైపు బీజేపీని మరోవైపు కాంగ్రెస్ ను కేసీయార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకనే వివిధ పార్టీల అధినేతలను కలుస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే మహారాష్ట్రలో ఉన్నది శివశేన-కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం. పై మూడు పార్టీల్లో కాంగ్రెస్, ఎన్సీపీల్లో ఏది పక్కకుపోయినా సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం.
ఇలాంటి పరిస్ధితుల్లో తనతో థాక్రే చేతులు కలుపుతారని కేసీయార్ ఎలా అనుకున్నారో. పైగా ఎన్సీపీ శరద్ పవార్ కూడా కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని గతంలోనే చెప్పున్నారు. అలాంటపుడు కేసీయార్ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో అనుమానంగానే ఉంది. కేసీయార్ లాగే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసేందుకు అవకాశముంది. మమత తప్ప కేసీయార్ తో చేతులు కలపటానికి ఇంకెవరు సిద్ధంగా లేరనే అనిపిస్తోంది. ఈ నేపధ్యంలో కేసీయార్ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాల్సిందే.
This post was last modified on February 20, 2022 6:50 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…