వృద్ధిమాన్ సాహా.. ఎన్నో ఏళ్లుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్. ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా అభివర్ణిస్తారు విశ్లేషకులు. ఐతే ధోని లాంటి మేటి ఆటగాడు మూడు ఫార్మాట్లలో దశాబ్దంన్నర పాటు జట్టులో పాతుకుపోవడంతో అతడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ధోని అందుబాటులో లేనపుడు మాత్రమే అతడికి అవకాశాలు దక్కేవి.
ధోని టెస్టుల నుంచి రిటైరయ్యాక రెగ్యులర్ వికెట్ కీపర్‌గా జట్టులో ఉంటూ వచ్చాడు కానీ.. అతడికి యువ ఆటగాడు రిషబ్ పంత్ గండి కొట్టాడు. వేగంగా భారత జట్టులోకి దూసుకొచ్చిన అతను.. సాహా స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చాడు. ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్‌లో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి.. సాహాకు తుది జట్టులో చోటు లేకుండా చేశాడు. వయసు మీద పడటం, ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలు సాహాకు ప్రతికూలంగా మారి.. చోటు గల్లంతైంది. ఇన్నాళ్లూ జట్టులోకి ఎంపిక చేసి తుది జట్టుకు మాత్రమే దూరం పెట్టేవారు.
కానీ ఇప్పుడు పూర్తిగా జట్టు నుంచే తప్పించేశారు.ఐతే ఎంత మేటి ఆటగాళ్లకైనా ఇలాంటి పరిస్థితి ఎదురవడం సహజం. కానీ 37 ఏళ్ల సాహా మాత్రం సెలక్టర్ల నిర్ణయాన్ని జీర్ణించుకోలేక మీడియా ముందుకొచ్చేశాడు. ఈ సిరీస్ కంటే ముందే తనకు టీమ్ మేనేజ్మెంట్ తనతో మాట్లాడిందని.. ఇక తనను జట్టు ఎంపికకు పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసిందని సాహా వ్యాఖ్యానించాడు. అంతే కాక కోచ్ రాహుల్ ద్రవిడ్ తనతో మాట్లాడుతూ రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని చెప్పినట్లు వెల్లడించాడు. గత ఏడాది చివర్లో న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో తాను పెయిన్ కిల్లర్స్ వేసుకుని మరీ అర్ధసెంచరీ సాధించానని.. అప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీనే తనకు వాట్సాప్ ద్వారా విషెస్ చెప్పి తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటానని చెప్పాడని.. కానీ కొన్ని నెలల్లోనే ఇంత వేగంగా పరిస్థితులు ఎలా మారిపోయాయో తనకు తెలియట్లేదని వ్యాఖ్యానించాడు.
ఈ వ్యాఖ్యలు భారత క్రికెట్లో చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా.. చోటు పోయిన ఫ్రస్టేషన్లో ఉన్న సాహాను వాడుకుని టీఆర్పీలు పెంచుకోవడానికి కొన్ని ఛానెళ్లు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ జర్నలిస్టు సాహాతో చేసిన మెసేజ్ చాట్ బయటికి వచ్చింది. తనకు ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరి.. అందుకు ఒప్పుకోనందుకు సదరు జర్నలిస్టు తనను ఎలా బెదిరించాడో సాహా స్క్రీన్ షాట్ పెట్టి అందరికీ చూపించాడు. మొత్తానికి సాహా వ్యవహారం భారత క్రికెట్లో చిన్నపాటి దుమారాన్ని రేపేలా కనిపిస్తోంది.
This post was last modified on February 20, 2022 6:54 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…