Political News

కేసీయార్ తో థాక్రే చేతులు కలుపుతారా ?

కేంద్రంలోని బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసం కేసీయార్ ముంబాయ్ లో బిజీ బిజీగా ఉండబోతున్నారు. ఆదివారం ఉదయానికి కేసీయార్ ముంబాయ్ చేరుకుంటారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్థవ్ థాక్రే ఆహ్వానం మేరకు కేసీయార్ ముంబాయ్ వెళుతున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి అని చెబుతున్నప్పటికి ఇది పక్కాగా నరేంద్రమోడి వ్యతిరేక కూటమనే అనుకోవాలి. ఎందుకంటే మోడి బాడీలాంగ్వేజ్ తోనే చాలామంది విభేదిస్తున్నారు.

మధ్యాహ్నం థాక్రే ఇంట్లో లంచ్ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ లో జాతీయ రాజకీయాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతంది. ఎన్డీయేయేతర, యూపీయేయేతర పార్టీలను ఏకతాటిపైకి తేవటమే ప్రధాన అజెండాగా వీళ్ళ సమావేశం ఉండబోతోంది. పనిలోపనిగా గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలని అనుకుంటున్న వార్ధా ప్రాజెక్టుపైన కూడా చర్చ జరుగుతుంది. దాదాపు రెండున్నర గంటపాటు వీళ్ళ భేటీ జరిగే అవకాశముందని సమాచారం.

తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కూడా కేసీయార్ కలవబోతున్నారు. వీళ్ళమధ్య కూడా బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుపైనే చర్చలు జరుగుతాయి.  ఒకవైపు బీజేపీని మరోవైపు కాంగ్రెస్ ను కేసీయార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకనే వివిధ పార్టీల అధినేతలను కలుస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే మహారాష్ట్రలో ఉన్నది శివశేన-కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం. పై మూడు పార్టీల్లో కాంగ్రెస్, ఎన్సీపీల్లో ఏది పక్కకుపోయినా సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం.

ఇలాంటి పరిస్ధితుల్లో  తనతో థాక్రే చేతులు కలుపుతారని కేసీయార్  ఎలా అనుకున్నారో. పైగా ఎన్సీపీ శరద్ పవార్ కూడా కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని గతంలోనే చెప్పున్నారు. అలాంటపుడు కేసీయార్ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో అనుమానంగానే ఉంది. కేసీయార్ లాగే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసేందుకు అవకాశముంది. మమత తప్ప కేసీయార్ తో చేతులు కలపటానికి ఇంకెవరు సిద్ధంగా లేరనే అనిపిస్తోంది. ఈ నేపధ్యంలో కేసీయార్ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాల్సిందే.

This post was last modified on February 20, 2022 10:46 am

Share

Recent Posts

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

55 minutes ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

1 hour ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

2 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

4 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

4 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

5 hours ago