బిగ్‌బాస్…ఈ షో పాపులారిటీ గురించి పరిచయం చేయనవసరం లేదు. అదే సమయంలో దీనిపై వివాదాలు కూడా తెలిసిన సంగతే. తెలుగులో బిగ్ బాస్- 5 పూర్తి అయి దాదాపు రెండు నెలలు కావస్తున్న సమయంలో మరో సీజన్‌కు శ్రీకారం చుట్టారు. మునుపటిలా టీవీలో కాకుండా ఓటీటీలో వచ్చే ఈ కొత్త సీజన్‌పై అప్పుడే కామెంట్లు మొదలయ్యాయి. దీనిపై స్పందించింది ఎవరో కాదు.. బిగ్ బాస్ అంటేనే కస్సున లేచే సీపీఐ నేత నారాయణ.
ఇటీవల బిగ్‌బాస్ ఓటీటీ ప్రోమో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆసక్తికరంగా ఉన్న ఈ షోలో ఉరిశిక్ష పడే ఖైదీ అయిన వెన్నెల కిశోర్ బిగ్‌బాస్ చూడాలని అనుకుంటాడు. దీంతో ఉరిశిక్షను సైతం వాయిదా వేసి ఆయనకు బిగ్ బాస్ చూసే చాన్సిస్తారు.
అంతేకాకుండా జైల్లోని సిబ్బంది, అధికారులు కూడా ఆయనతో కలిసి ఈ షో చూస్తారు. దీనిపైనే నారాయణకు మండిపోయింది. `ఉరిశిక్ష పడే ఖైదీకి సైతం ఆ శిక్ష అమలు వాయిదావేసి #బిగ్ బాస్”చూసేందుకు అనుమతిస్తారు. ఇది ప్రముఖ హీరో నాగార్జున వాణిజ్య ప్రకటన. బిగ్ బాస్ సమాజానికేం సందేశం ఇస్తుంది ??? మీరేసమాదానం చెప్పాలి“ అంటూ తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యారు.
ఇటీవలే నాగార్జునపై తనకున్న కోపం, అక్కసు అన్నింటినీ ఓ షోలో నారాయణ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో ద్వారా నాగార్జున ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నారాయణ నిలదీశారు. ఈ షో విషయంలో తాను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఏకంగా ప్రోమోపై స్పందించారు. బిగ్‌బాస్ పై మిగతా వారికంటే నారాయణకే ప్రత్యేకంగా ఆసక్తి ఉన్నట్లుందని కొందరు కామెంట్ చేయడం కొసమెరుపు. మరోవైపు బిగ్ బాస్ షోలో మొదటి సీజన్ నుంచి ఐదో సీజన్ వరకు పాల్గొన్న కొందరు కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసుకొని.. వాళ్లని ఇప్పుడు ఓటీటీ కోసం మరోసారి ఇంట్లోకి పంపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
This post was last modified on February 19, 2022 2:31 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…