గత కొద్ది కాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు స్పీడు తగ్గిపోయింది.ఇదే సమయంలో బాలయ్య యాక్టివ్ అవుతున్నారు. అంతులేని ఉత్సాహాన్ని అవధిగా అందుకుని దూసుకుపోతున్నారు.ఆ వేగంలోఆయన నిర్ణయాలు కూడా బాగానే ఉంటున్నాయి.తడబాటు లేదు.తొట్రుపాటు అంత కన్నాలేదు. పొలిటికల్ డైలాగులు కూడా బాగానే పేలుతున్నాయి. నచ్చిందే చేద్దాం ఎవడు ఆపుతాడో చూద్దాం అని బాలయ్య హిందూపురం పొద్దుల్లో చెప్పిన మాటలు పొలిటికల్ హీట్ కు కారణం అయ్యాయి.అదేవిధగా చంద్రబాబు గతం కన్నా ఇప్పుడు చాలా విషయాల్లో ఆచితూచి స్పందిస్తున్నారు.ఉద్యోగుల ఉద్యమాలపై కూడా చాలా ఆచితూచి మాట్లాడారు.
ఎందుకంటే ఈ పీఆర్సీ గొడవలు అన్నవి ఎప్పుడూ ఉండేవే కనుక తాను కేవలం చలో విజయవాడ అనే కార్యక్రమం వరకూ మాత్రమే పరిమితం అయి, పోలీసుల చర్యలను మాత్రమే ఖండించి తెలివిగా తప్పుకున్నారు అన్నది వైసీపీ వాదన. కానీ నిజంగా ఆయన మాట్లాడగలిగితే ఉద్యోగుల నుంచి మంచి మద్దతు దక్కేది అని కానీ ఆయన మాట్లాడలేదు అని ఎందుకంటే రేపటి వేళ ఇదే సమస్య తనకు వస్తే దిక్కెవరని భావించి ఉంటారని ఓ ఉపాధ్యాయ సంఘ నాయకుడు వ్యాఖ్యానించారు.
ఇక కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా బాబు చాలా హుందాగానే ఉన్నారు. వివాదాలకు పోవడం లేదు. అప్పటి మాదిరి పెద్దిరెడ్డి అనే పెద్దాయనను ఢీ కొనడం లేదు. చిత్తూరు రాజకీయాలను మళ్లీ ఎందుకనో వదిలేశారు.పెద్దగా పట్టించుకోవడం లేదు అన్న టాక్ కూడా నడుస్తోంది. చిత్తూరులో నగరి నియోజకవర్గంలో ఎదిగేందుకు గాలి వారసులు చేస్తున్న కృషి కి పెద్దిరెడ్డి అండ ఉందన్న టాక్ బాగానే ఉంది. కనుక బాబు ఆ నియోజకవర్గం వార్ ను పట్టించుకోవడం లేదు.
కుప్పం రాజకీయ పరిణామాలను కూడా విజయవాడ నుంచే పరిశీలిస్తున్నారు.ఇదే సమయాన బోండా ఉమా లాంటి నాయకులు మాట్లాడుతున్న తిరుగుబాటు చేస్తున్నంత రీతిలో కూడా చంద్రబాబు కానీ, లోకేశ్ కానీ మాట్లాడడం లేదు. ముఖ్యంగా నాని వ్యాఖ్యలపై నేరుగా ఇంతవరకూ చంద్రబాబు కానీ లోకేశ్ కానీ స్పందించకపోవడం వెనుక సిసలు కారణం ఏమై ఉంటుందో అన్న వాదన లేదా అనుమానం ఒకటి ఎప్పటి నుంచో పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది.
This post was last modified on February 19, 2022 11:44 am
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్.. ఈ వార్త బయటికి వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయిన వాళ్లే. తెలుగులో సున్నితమైన లవ్ స్టోరీలు,…
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్.. ఇలా వరుసగా నందమూరి బాలకృష్ణ చిత్రాలకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమనే…
పెట్టుబడులను రాబట్టేందుకు ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి రెండో రోజే ఫలితం రాబట్టారు.…
ఏపీలో అధికార కూటమిలో కీలక పార్టీగా ఉన్న జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని రాజకీయా…