Political News

కేసీఆర్ మాట లైట్ తీసుకోండి: డిప్యూటీ సీఎం

గ‌త కొద్దికాలంగా కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌పై విరుచుకుప‌డుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి ఈ క్రమంలో వివిధ విధానాల‌ను త‌ప్పుప‌డుతున్న సంగ‌తి తెలిసిదే. ఈ క్రమంలోనే విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల‌ను త‌ప్పుప‌డుతూ వ్యవసాయ మోటర్లకు మీటర్ల బిగింపును ష‌ర‌తుగా పెడుతున్నార‌ని ఏపీలోని శ్రీ‌కాకుళం జిల్లాలో ఇప్పటికే విద్యుత్‌ మీటర్లు బిగిస్తున్నారని తెలియ‌జేశారు. కేసీఆర్ కామెంట్ల‌పై ఏపీలోనూ చ‌ర్చ జ‌రిగింది. అయితే, శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన‌ ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. శ్రీ‌కాకుళంలో వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు మనకు అనవసరం అని జిల్లా రైతుల‌కు పిలుపునిచ్చారు!.

వ్యవసాయ బోర్లకు మీటర్లు వలన రైతులకు ఒక్క రూపాయి నష్టం ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్ స్ప‌ష్టం చేశారు. వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బంది ఉండదు.. ఇది శిలాక్షరాలతో రాసుకోండి అని వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉన్నంత వరకూ రైతులకు ఉచిత విద్యుత్‌ కొనసాగుతుందని ధర్మాన కృష్ణ‌దాస్ ప్రకటించారు.

ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడానికి రైతులకు అవగాహన లేకపోవడమే కారణంగా తెలిపిన ఆయన.. స‌రైన వెరైటీ పండించక‌పోవ‌డం, పంట నూర్పిడి ఆలస్యం కావడం సమస్యగా మారిందన్నారు. మిల్లర్లకు సమయానికి ధాన్యం అందించలేక‌పోతున్నారని.. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం అవుతోందని.. రైతుల సమస్యలను సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన స‌మ‌యంలో ఏపీ ప్ర‌స్తావ‌న తేవ‌డం, అది త‌మ‌ను ఇరుకున ప‌డేస్తున్న స‌మ‌యంలో పొరుగు రాష్ట్ర ముఖ్య‌మంత్రి కామెంట్ల‌ను లైట్ తీసుకోవాల‌ని ఏపీ డిప్యూటీ సీఎం  డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ పిలుపునివ్వ‌డం స‌హ‌జంగానే ఆస‌క్తిక‌రంగా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం కామెంట్ల‌కు గులాబీ ద‌ళం ఎలా రియాక్ట‌వుతుందో మ‌రి.

This post was last modified on February 19, 2022 8:35 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

7 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

8 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

8 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

9 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

9 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

10 hours ago