Political News

వైసీపీ ఎంపీ గొడవ పడింది నిజమేనా?

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కేంద్రంగా వివాదాలు పెరిగిపోతున్నాయి. రెగ్యులర్ గా ఏదో వివాదంలో ఎంపీ ఎందుకు ఇరుక్కుంటున్నారో అర్ధం కావటం లేదు. తాజాగా తన అనుచరులతో ఎంపీ కృష్ణలంక పోలీసుస్టేషన్ లో వీరంగం చేసినట్లు, పోలీసులపై దౌర్జన్యం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సరే ఈ ప్రచారాన్ని ఎంపీ ఖండిస్తున్నారనుకోండి అది వేరే సంగతి. పోలీసుస్టేషన్లో జరిగింది చాలా చిన్న ఘటనైతే దాన్ని తానంటే పడని మీడియా బూతద్దంలో చూపిస్తోందంటు మండిపోయారు.

పైగా ఎక్కడెక్కడో జరిగిన ఘటనలన్నీ తనమీదే రుద్దితే ఎలాగంటు నిలదీశారు. సరే ఎంపీ వాదన ఎలాగున్నా అసలేం జరిగింది ? అని ఆరా తీస్తే జరిగిన దాంట్లో ఎస్ఐ అతి కూడా స్పష్టంగా కనబడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే బుధవారం అర్ధరాత్రి ఎస్ఐ మూర్తి తన సిబ్బందితో బస్టాండ్ దగ్గర వాహనాల చెకింగ్ లో ఉన్నారు. అదే సమయంలో మోటారుసైకిల్ పై త్రిబుల్ రైడింగ్ లో ముగ్గురు యువకులు వచ్చారు. వాళ్ళని ఆపిన ఎస్ఐ వివరాలడిగారు.

తాము సినిమా చూసొస్తున్నట్లు చెప్పిన వారు భోజనానికి వెళుతున్నామని చెప్పారు. త్రిబుల్ రైడింగ్ తప్పని చెప్పిన ఎస్ఐ వారిలో ఒకరిని అందరి ముందు కొట్టారు. దాంతో వారిలో ఒకడు తాము ఎంపీ బంధువని చెప్పటంతో ముగ్గురినీ పోలీసుస్టేషన్ కు తరలించారు. తర్వాత స్టేషన్ కు వచ్చిన ఎస్ఐ మళ్ళీ వాళ్ళని కొట్టారు. ఎస్ఐ తమని కొట్టడాన్ని మొబైల్ ఫోన్లో వీడియో తీసిన కుర్రాళ్ళు దాన్ని ఎంపీకి పంపారు.  ఎంపీ ఫోన్ చేసినా ఎస్ఐ తీయలేదు. దాంతో నేరుగా స్టేషన్ కు వచ్చారు ఎంపీ.

అక్కడ ఎస్ఐకి ఎంపీగా వాగ్వాదం జరిగింది. తాను ఫోన్ చేసినా ఎందుకని తీయలేదంటు ఎంపీ ఆగ్రహంతో ఊగిపోయారు. అయితే మాస్కు పెట్టుకున్న ఎంపీని ఎస్ఐ ముందు గుర్తించకుండా ర్యాష్ గా మాట్లాడారట. మాస్కు తీసేసిన తర్వాత ఎంపీనీ గుర్తుపట్టారు. ఈలోగానే ఎంపీ అనుచరులకు స్టేషన్ సిబ్బందికి వాగ్వాదం జరిగింది. మోటారు వాహనాల చట్టం క్రింద కేసు నమోదు చేసి ముగ్గురిని ఎస్ఐ వదిలేశారు.

త్రిబుల్ రైడింగ్ చేసిన వారిని  ఎస్ఐ మందలించి  చలానా రాసి వారిని బస్టాండ్ దగ్గరే వదిలేసుండవచ్చు. కానీ అలాచేయకుండా ఎస్ఐ వారిని కొట్టారు. పోనీ స్టేషన్ కు తెచ్చిన తర్వాతైనా వారిని వదిలేశారా అంటే మళ్ళీ అక్కడా కొట్టారు. అంటే తాను ఎంపీ బంధువునని చెప్పిన తర్వాతే ఎస్ఐ కొట్టినట్లు అర్ధమవుతోంది. పోలీసుస్టేషన్లో వారిపై నమోదుచేసిన కేసేదో బస్టాండ్ లోనే చేసుండచ్చు. కొట్టడం చట్ట ప్రకారం తప్పు. అయినా ఎస్సై తెలిసే చేశారన్నది ఎంపీ మనుషుల ఆరోపణ. ఏదేమైనా పోలీసులతో దురుసుగా వ్యవహరించటం ఎంపీ తప్పేనటంలో సందేహం లేదు.

This post was last modified on February 17, 2022 10:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మరో సారి కేటీఆర్ పై రెచ్చిపోయిన కొండా సురేఖ

లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…

4 hours ago

ధనుష్ కోసం నయన్ ఫ్రీ సాంగ్

రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…

6 hours ago

విశ్వసుందరి కిరీటం విక్టోరియాకే.. ఇది మరో చరిత్ర!

ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…

7 hours ago

ఆదివారం కూడా.. కేసీఆర్‌ను వ‌దిలిపెట్ట‌వా రేవంత్‌!?

సండే ఈజ్ ఏ హాలీడే కాబ‌ట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్ర‌జ‌లంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజ‌కీయ‌ నాయ‌కులు మాత్రం…

7 hours ago

కేజ్రీవాల్ కు మరో దెబ్బ..

దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…

7 hours ago

కీర్తి సురేష్ పెళ్లి.. నిజమేనా?

ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…

7 hours ago