Political News

పోలీస్ స్టేషన్లో ఎంపీ సురేష్ హల్ చల్

విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ హల్ చల్ చేశారు. తన అనుచరులను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ఎస్ ఐ, సిబ్బందితో నందిగం సురేష్, ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని ఫోన్ లో రికార్డు చేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ పై కూడా సురేష్ అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. తన ఫోన్ ఇవ్వాలని కోరిన శ్రీనివాస్ పై సురేష్ అనుచరులు దాడి కూడా చేసినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురు యువకుల్లో ఒకరు సురేష్ మేనల్లుడని తెలుస్తోంది.

విజయవాడలోని ఓ మల్టిప్లెక్స్ లో సినిమా చూసి వస్తున్న ముగ్గురు యువకులు బైకుపై అతివేగంగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ఆ ముగ్గురినీ ఆపిన కృష్ణలంక పోలీసులు..వారిని ప్రశ్నించారు. అయితే, తాము ఎంపీ నందిగం సురేష్ మనుషులమని పోలీసులడిగిన ప్రశ్నలకు జవాబివ్వకుండా…ఆ యువకులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో, ఆ యువకులను బలవంతంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, ఆ తతంగాన్ని వీడియో తీసిన యువకులు…దానిని నందిగం సురేష్‌కు పంపించారు.

దీంతో, అర్ధరాత్రి హుటాహుటిన తన అనుచరులతో కలిసి ఎంపీ నందిగం సురేష్ కృష్ణలంక పీఎస్‌కు వచ్చి హల్ చల్ చేశారు. తన అనుచరులను పీఎస్‌కు ఎందుకు తీసుకొచ్చారంటూ చిందులు తొక్కారు. వారిపై ఎందుకు చేయి చేసుకున్నారంటూ నానా హంగామా చేశారు. పోలీసులతో నందిగం సురేష్, ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగి దురుసుగా ప్రవర్తించారు. దీంతో, ఆ తతంగాన్ని రికార్డ్ చేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ ఫోన్ ను సురేష్ అనుచరులు లాక్కున్నారు. అంతటితో ఆగకుండా…స్టేషన్ లోని ఫర్నిచర్ ను సురేష్ అనుచరులు ధ్వసం చేసి పీఎస్‌ నుంచి వెళ్లిపోయారు.

ఆ సమయంలో తన ఫోన్ తిరిగివ్వాలని ఎంపీ అనుచరులను కానిస్టేబుల్ శ్రీనివాస్ కోరగా, అతడిపై వారు దాడి చేసి అక్కడినుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు పొక్కుండా పోలీసు ఉన్నతాధికారులు యత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారం ఆల్రెడీ సోషల్ మీడియా, మీడియాలో లీక్ కావడంతో ఏం చేయాలా అని ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది.

This post was last modified on February 16, 2022 4:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

3 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

5 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

7 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

8 hours ago