Political News

బీజేపీని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ?

కొద్దిరోజులుగా కేసీయార్ మీడియా సమావేశాలు లేదా బహిరంగ సభల్లో ప్రసంగాలు వింటుంటే ఒక డౌటు పెరిగిపోతోంది. అదేమిటంటే ఎక్కువగా బీజేపీని ప్రధానంగా నరేంద్రమోడిని మాత్రమే డైరెక్టుగా ఎటాక్ చేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ మీద దాడిని తగ్గించటమే కాకుండా కాస్త సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. కేసీయార్ వైఖరిపై రెండు విషయాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి.

అదేమిటంటే మొదటిది  కాంగ్రెస్ కన్నా బీజేపీనే ఎక్కువ ప్రమాదమని అనుకుంటున్నట్లున్నారు.  ఇక రెండోది జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్న కేసీయార్ కాంగ్రెస్ తో సఖ్యతను కోరుకుంటున్నారా ? అనే డౌట్లు పెరిగిపోతున్నాయి. ఈ కారణాలతోనే తన దాడులు మొత్తం బీజేపీ మీదనే చేస్తున్నట్లున్నారు. మీడియా సమావేశాల్లో గానీ, బహిరంగసభల్లో కానీ అస్సాం బీజేపీ  ముఖ్యమంత్రి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధిపైన చేసిన అనుచితమైన వ్యాఖ్యలను పదే పదే ప్రస్తావిస్తుండటమే సాక్ష్యంగా అనుకోవాలి.

బీజేపీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అగ్రనేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసీయార్ స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యర్ధులపై నోరుపారేసుకోవటంలో కేసీయార్ కూడా ఏమీ తక్కువ తినలేదు. నోటికేదొస్తే అది మాట్లాడేసి ఇదంతా ఉద్యమంలో భాగమనో, ఉద్యమాలు నడిపిన వాళ్ళకిదంతా సహజమే అనో చాలాసార్లు సమర్ధించుకున్నారు. అలాంటి కేసీయార్ రాహుల్ విషయంలో ఇంత మద్దతుగా మాట్లాడుతున్నారంటేనే అనుమానాలు మొదలయ్యాయి.

ఇక రాష్ట్రానికి సంబంధించి కూడా తన ఎటాక్ ఎక్కువగా బీజేపీ చీఫ్ బండి సంజయ్ గురించే ఉంటోంది.  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ప్రస్తావనను కేసీయార్ పెద్దగా తేవటంలేదు. బండి లాగే రేవంత్ కూడా కేసీయార్ ను ఎటాక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రేవంత్ మాటలకు కేసీయార్ పెద్దగా రియాక్టవ్వటంలేదు. బహుశా బీజేపీతోనే తనకు ఎక్కువ ప్రమాదమని కేసీయార్ అనుకుంటున్నట్లున్నారు. పైగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని అనకుంటున్న కేసీయార్ కు కాంగ్రెస్ తో దోస్తానా లేకుండా సాధ్యంకాదు. అందుకనే బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే కేసీయార్ పావులు కదుపుతున్నట్లున్నారు. 

This post was last modified on February 14, 2022 5:36 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

6 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

7 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

7 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

9 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

11 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

12 hours ago