తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఎవరైనా కోపం తెప్పిస్తే.. ఆయన ఎంతవరకైనా వెళ్తారు. ప్రత్యర్థిని దారికి తెచ్చుకోవడమో లేదా ఇబ్బందుల్లోకి నెట్టడమో చేస్తుంటారు. కానీ అదే ఎవరిపైనా అయినా ప్రేమ వస్తే మాత్రం అడగకుండానే వరాలు ఇచ్చేస్తారు. అధిక ప్రయోజనాలు కట్టబెడతారు. కేసీఆర్ గురించి తెలిసిన ఎవరైనా ఆయన తీరు గురించి ఇలాగే చెప్తారనడంలో సందేహం లేదు. మరి ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు అంటారా? జిల్లాల పర్యటనలో ఉన్న కేసీఆర్.. రోజుకో దగ్గర భారీ బహిరంగ సభ పెట్టి కేంద్రంలోని బీజేపీపై మాటల యుద్ధం చేస్తున్నారు. ఆ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి మద్దతుగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
ఆ ఎన్నికలతో..
ప్రస్తుతం దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలతో రాజకీయాలు హీటెక్కాయి. దేశంలో ఎక్కడా ఏ పరిణామం జరిగినా దాన్ని ఈ ఎన్నికలతో ముడిపెట్టి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీపై కాంగ్రెస్ నాయకులు.. కాంగ్రెస్‌పై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నాయి.
ఈ క్రమంలో రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ బీజేపీ సీఎం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తామెప్పుడైనా రాహుల్ గాంధీ పుట్టుక గురించి మాట్లాడామా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2016లో భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ ఆధారాలు అడిగారు.. కానీ తామెప్పుడైనా రాహుల్ గాంధీ వ్యక్తిగత విషయాల గురించి అడిగామా అని హిమంత అన్నారు. రాహుల్ ఎవరికి పుట్టారో సాక్షం కావాలని అడిగామా అంటూ ప్రశ్నించారు.
కన్నీళ్లు వస్తున్నాయి..
రాహుల్ గాంధీపై బీజేపీ సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి. తాజాగా రాయగిరి సభలో మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ల కుటుంబం గురించి ఇలాగైనా మాట్లాడేదని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు తనను కలిచివేశాయని కళ్ల నుంచి కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు. ధర్మం గురించి మాట్లాడే బీజేపీకి ధర్మం అంటే ఇదేనా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమంతను తక్షణమే బర్తరఫ్ చేయాలని ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కేసీఆర్ డిమాండ్ చేశారు. దేశంలో ఎవరికి అన్యాయం చేసినా సహించేది లేదన్నారు. కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్‌పై ప్రేమ పుట్టుకురావడానికి కారణం మోడీపై కోపమేనని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు రాహుల్ గాంధీకి మద్దతుగా మాట్లాడడంతో రాష్ట్రంలో ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టినట్లయిందని నిపుణులు చెబుతున్నారు.
This post was last modified on February 14, 2022 9:23 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…