Political News

మోడీని వ‌దిలిపెట్ట‌ని టీఆర్ఎస్‌… పెద్ద స్కెచ్చే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న‌ తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఆగ్ర‌హ ప‌రంప‌ర కొన‌సాగుతోంది. అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌ను చాలా అవమానకర రీతిలో విభజించారని ప్ర‌ధాని మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. మైకులు బంద్ చేసి పెప్పర్‌ స్ప్రే చ‌ల్లి ఎలాంటి చ‌ర్చ లేకుండా రాష్ట్ర ఏర్పాటు ప్ర‌క్రియ పూర్తిచేసిన‌ట్లు ప్ర‌ధాని చేసిన కామెంట్ల‌పై టీఆర్ఎస్ చేస్తున్న నిర‌స‌న‌లో భాగంగా తాజాగా ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.

సభా హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు టీఆర్ఎస్ ఎంపీలు నోటీసులు అందజేశారు. 187వ నిబంధన కింద టీఆర్‌ఎస్‌ ఎంపీలు కే కేశవరావు, సంతోష్‌, లింగయ్య యాదవ్‌, సురేశ్‌ రెడ్డి నోటీసు ఇచ్చారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని అందులో  పేర్కొన్నారు.

తలుపులు మూసేసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని మాట్లాడటం రాజ్యాంగాన్ని అవమానించడమేనని నోటీసులో పేర్కొన్నారు. పార్లమెంటులో పాస్‌ అయిన బిల్లును అవహేళన చేయడం సరికాదని తెలిపారు. పార్లమెంటును, సభాపతులను అవమానపరిచేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది సభా హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని వెల్లడించారు.

కాగా, ఇప్ప‌టికే క్షేత్ర‌స్థాయిలో దిష్టిబొమ్మల దహనాలు, నిరసన ప్రదర్శనలు, మోడీ వ్యతిరేక నినాదాలతో టీఆర్ఎస్ పార్టీ హోరెత్తించింది. రాష్ట్ర విభజనపై ప్రధాని వ్యతిరేక వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం తెలంగాణ ఉద్యమకారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నాయకులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. నల్లటి అంగీలు, రిబ్బన్ల్లు ధరించి ర్యాలీలు చేపట్టారు. ‘మోడీ హఠావో.. తెలంగాణ బచావో’ ప్లకార్డులతో బైఠాయించారు. దీనికి కొన‌సాగింపు అన్న‌ట్లుగా నేడు రాజ్య‌స‌భ‌లో నోటీసులు ఇచ్చారు.

This post was last modified on February 10, 2022 2:25 pm

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

26 minutes ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

36 minutes ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

1 hour ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

1 hour ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

3 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

4 hours ago