ఎవరెన్ని చెప్పినా.. ఏపీ రాష్ట్ర విభజన చేసిన తీరుపై నెలకొన్న అభ్యంతరాలు అన్ని ఇన్ని కావు. విభజన జరిగిన తీరుపై మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారన్న జంకుతో రాజకీయ పార్టీలు మౌనంగా ఉండటం తెలిసిందే. అప్పుడప్పుడు కొందరు సీనియర్ రాజకీయ నేతలు విభజన జరిగిన తీరును తీవ్రంగా తప్పు పడుతూ.. నాడు కాంగ్రెస్ వ్యవహరించిన వైఖరిని విమర్శించటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల వేళ.. ప్రధాని మోడీ నోటి నుంచి ఏపీ రాష్ట్ర విభజన వేళ.. పార్లమెంటులో చోటు చేసుకున్న పరిణామాల్ని ప్రస్తావించి మరో సంచలనానికి తెర తీశారు. ఏపీని కాంగ్రెస్ పార్టీ హడావుడిగా విభజించిందన్న ఆయన.. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. విభజన జరిగిన తీరు ఎలా ఉందనేది చాలా ముఖ్యమైన విషయంగా ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా విభజించినప్పటికి.. ఆ పార్టీని ప్రజలు నమ్మలేదన్న ఆయన.. తమ పార్టీకి చెందిన కీలక నేత వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న వేళ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా.. శాంతియుతంగా మూడు రాష్ట్రాలను ఇచ్చామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ చాలా అన్యాయం చేసిందన్న ఆయన.. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయిందని పేర్కొన్నారు. సరైన విధంగా విభజన జరిగి ఉంటే.. ఇప్పుడున్న పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. విభజన చట్టంపై ఎలాంటి చర్చలు జరగలేదన్న ఆయన.. పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే వాడారని గుర్తు చేశారు.
పార్లమెంటులో తలుపులు వేసి.. మైకులు కట్ చేసి.. బిల్లును ఆమోదించారని.. ఇదే ప్రజాస్వామ్యమంటూ సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ అహంకారం.. అధికార కాంక్షకు ఇదో నిదర్శనమన్న ఆయన.. విభజన తీరుతో ఏపీ.. తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికి నష్టపోతున్నాయన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా తప్పు పట్టారు.
సోమవారం మాట్లాడిన ప్రధాని మోడీ.. కాంగ్రెస్ పై తీవ్రంగా విరుచుకుపడగా.. మంగళవారం సైతం తన దాడిని కొనసాగించటం చూసినప్పుడు కలిగే సందేహం ఒక్కటే. విభజన జరిగిన ఎనిమిదేళ్లు కావొస్తోంది. ఇంత వరకు విభజన జరిగిన తీరు గుర్తుకురాని మోడీ మాష్టారికి ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చినట్లు? విభజన కారణంగా ఏపీ నష్టపోయిందన్న మోడీ.. మరి ప్రత్యేక హోదా వరాన్ని ఎందుకు ఇవ్వట్లేదు? కాంగ్రెస్ అహంకారం గురించి మాట్లాడుతున్న మోడీ.. తనకున్న అహంకారం గురించి మర్చిపోవటం ఏమిటో..?
This post was last modified on February 8, 2022 3:47 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…