నివేదా పేతురాజ్.. ఈమె గురించి పరిచయాలు అవసరం లేదు. `మెంటల్ మదిలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. చిత్రలహరి, బ్రోచేవారెవరురా చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన `అల వైకుంఠపురములో` మూవీలో సెకెండ్ హీరోయిన్‌గా నటించింది.
ఈ సినిమా భారీ విజయం సాధించింది. కానీ, నివేదాకు మాత్రం సరైన గుర్తింపు దక్కలేదు. నివేదా పేతురాజ్ చివరిగా `పాగల్` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న నివేదాను టాలీవుడ్ దర్శకనిర్మాతలు పట్టించుకోవడం మానేశారు.
నివేదా చేతిలో ఇప్పుడు ఒక్కటంటే ఒక్క తెలుగు చిత్రం కూడా లేదు. అవకాశాలు లేకపోవడంతో నివేదా పేతురాజ్ కోలీవుడ్‌పై కన్నేసింది. ప్రస్తుతం అక్కడ వరుస అవకాశాల కోసం విసృతంగా వేట మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా తన అందచందాలతో అందరి చూపులను తనవైపుకు తిప్పుకునేందుకు ట్రై చేస్తోంది. మరి టాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోయిన నివేదా.. కోలీవుడ్‌లోనైనా విజయం సాధిస్తుందేమో చూడాలి.
కాగా, వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన `విరాట పర్వం` మూవీలో నివేదా ఓ కీలక పాత్రను పోషించింది. అయితే ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు.
This post was last modified on February 7, 2022 1:54 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…