ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది. అప్పులు తెస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పటికే నిధుల లేమితో అక్కడ అభివృద్ధి పడకేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జగన్ మాత్రం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచుతూనే ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి చేదాటేలా ఉన్నప్పటికీ గతంలో బాబు ప్రభుత్వం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని వైసీపీ మంత్రులు కవర్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ తాజాగా ఆ పార్టీ మంత్రి పేర్ని నాని రాష్ట్రం దివాళా తీసిందనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం సందర్బంగా పేర్ని నాని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మహిళా ఉద్యోగులతో మాటల సందర్భంగా రాష్ట్రం దివాళా తీసిందనే అర్థం వచ్చేలా మాట్లాడారు. తమ సమస్యలను పట్టించుకోవాలని మహిళా ఉద్యోగులు కోరగా.. పేర్ని నాని ఓ కథ చెప్పారు. పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటే స్కూటర్ కొనిస్తానని కుమారుడికి ఓ తండ్రి చెప్పాడన్నారు. కానీ ఆ కొడుకు ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యే సమయానికి తండ్రి ఆర్థికంగా దివాళా తీశాడన్నారు. దీంతో స్కూటర్ కొనిస్తానని తండ్రి ఇచ్చిన హామీని నెరవేర్చలేదని కొడుకు తిట్టుకుంటే మాత్రం చేయగలిగిందేముంది అని నాని ప్రశ్నించారు. ప్రస్తుతం కొడుక్కు స్కూటర్ హామీ ఇచ్చిన తండ్రి పరిస్థితి లాగే ప్రభుత్వ పరిస్థితి ఉందని నాని చెప్పుకొచ్చారు.
ఇన్నాళ్లూ రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలే నిజమనేలా పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. నాని చెప్పిన ఈ కథ ప్రతిపక్షాలకు ఉపయోగ పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా నాని బహిరంగంగా ఇలా మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వైసీపీ నేతలే అంటున్నారు. ఆయన నోరు జారడం వల్ల ప్రభుత్వం ఇరకాటంలో పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ప్రతిపక్షాల నుంచి వచ్చే కౌంటర్లకు ఎప్పటికప్పుడూ సమాధానం ఇవ్వడంలో ముందుండే పేర్ని నాని ఇలా మాట జారడం కొత్తగా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మహిళా ఉద్యోగులకు వివరించేందుకు ఆయన ప్రయత్నం చేయడం సరేకానీ మరీ ఇలా చెప్పడం మాత్రం బాలేదని అంటున్నారు.
This post was last modified on February 7, 2022 12:46 pm
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…