ప్రధాని నరేంద్ర మోడీకి సోషల్ మీడియాలో భారీ సెగ తగిలింది. ఆయన హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ (రామానుజార్యులు) విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంతరం.. ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈక్వాలిటీ గురించి మాట్లాడారు. దీనిపైనే నెటిజన్లు నిముషాల వ్యవధిలో రియాక్ట్ అయ్యారు. ఈక్వాలిటీ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ (రామానుజార్యులు) విగ్రహ ఆవిష్కరణ కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధానిని “ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ“ అంటూ నెటిజన్లు ప్రశ్నించారు.
`ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ` అనే హాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ట్రెండ్ అయింది. ఈ మేరకు తెలంగాణకు చెందిన నెటిజన్లు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు ట్విట్టర్ వేదికగా తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని, వివక్షను తమ ట్విట్లలో ఎండగట్టారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధుల పంపిణీ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అందని సాయం, పునర్ విభజన చట్టం హామీలు, తెలంగాణకు దక్కని జాతీయ ప్రాజెక్టు హోదా వంటి అనేక అంశాలపై తమదైన శైలిలో ప్రశ్నించారు.
పలువురు రాష్ట్ర మంత్రులు సైతం ప్రధాని పర్యటన సందర్భంగా ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వ వివక్షను ప్రశ్నించారు. కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ సమస్యలపై తమ ప్రభుత్వంతోపాటు మంత్రులు, కేంద్రానికి పంపిన లేఖలపై ఇప్పటిదాకా స్పందించకపోవడం పట్ల ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణలోని వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపై చూపిస్తున్న వివక్షపై మంత్రి నిరంజన్ రెడ్డి పలు ప్రశ్నలు లేవనెత్తారు.
తెలంగాణలో ఘనంగా జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించకపోవడంపై మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. వివిధ కార్యక్రమాలతో పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఎందుకు ఆపుతుందని ఎంపీ రంజిత్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షను ఎండగట్టేలా వివిధ అంశాలతో ట్యాంక్ బండ్‌పై భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు. సుమారు 20 వేలకు పైగా ట్వీట్లు ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ హాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్ అయ్యాయి.
This post was last modified on February 5, 2022 10:40 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…