ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరో నాలుగు రోజుల్లో తొలి విడత(ఈ నెల 10న) ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి, సాధువు, ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఆయనకు సొంత ఇల్లు లేదని తెలిపారు. అదేసమయంలో రెండు తుపాకులు.. ఒక ఫోన్, కోటి రూపాయలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు లోక్‌సభకు ఐదుసార్లు ఎన్నికైన యోగీ ఆదిత్యనాథ్ తొలిసారి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా గోరఖ్‌పుర్ శాసనసభస్థానం నుంచి నామినేషన్ దాఖలుచేశారు.
ఈ సందర్భంగా ఆస్తులు, ఆయనపై ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. ఆయనకు కోటి 54 లక్షల 94 వేల 54 రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో కొంత నగదుతోపాటు వివిధ బ్యాంకు ఖాతాల్లో మరికొంత డబ్బు ఉన్నట్లు తెలిపారు. వీటితోపాటు 12వేల రూపాయల విలువ కలిగిన ఓ శాంసంగ్ మొబైల్ ఫోన్, లక్ష రూపాయల విలువగల రివాల్వర్, రూ.80 వేల విలువ కలిగిన మరో రైఫిల్ ఉన్నట్లు యోగి ఆదిత్యనాథ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు.
49 వేల రూపాయల విలువగల బంగారు చెవి రింగు, రూ.20 వేల విలువ కలిగిన రుద్రాక్షహారం తన వద్ద ఉన్నట్లు యోగి పేర్కొన్నారు. తనకు ఎటువంటి వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. సొంత వాహనం కూడా లేదని పేర్కొన్నారు. బ్యాంకుల్లో ఎటువంటి రుణాలూ లేవని వెల్లడించారు.
పెండింగ్‌లోనూ ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. వీటితోపాటు గత నాలుగేళ్లలో ఆయన ఆదాయ వివరాలను కూడా అఫిడవిట్‌లో యోగీ పొందుపరిచారు. ప్రస్తుతం యోగి ఆస్తుల వివరాలు.. అఫిడవిట్ సోషల్ మీడియాలో ఆసక్తిగా మారాయి. సాధువుకు.. తుపాకులు ఎందుకు? సర్వసంఘపరిత్యాగికి కోటి రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయి? అంటూ.. ప్రశ్నలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on February 6, 2022 9:24 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…