ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా వైసీపీ ఏ విధంగా నడుచుకుంటుంది, ఏ విధంగా పన్నులు విధిస్తోంది..ఇంకా ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరంగా ఉంచుతోంది వంటి అంశాలపై టీడీపీ బాగానే ఫోకస్ చేస్తోంది.దీంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న కీలక సమస్యలు కొన్ని వెలుగు చూస్తున్నాయి.అదేవిధంగా కీలకం అయిన భావనపాడు పోర్టు, సాగర మాల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఎంపీ రామూ ప్రశ్నించి, సంబంధిత వర్గాల నుంచి జవాబులు రాబట్టారు.లోక్ సభలో 22 మంది ఎంపీలు ఉండి కూడా ప్రయోజనాత్మక రీతిలో వాళ్లెవ్వరూ పనిచేయడం లేదని ఆవేదన చెందారు. రాష్ట్రంలో అమలవుతున్న పన్నుల విధానం పై పదే పదే సభకు వివరించి, విన్నవించి ఎంపీ రామూ తన ప్రసంగాన్ని నిన్నటి వేళ ముగించారు.
ఇవాళ కూడా పార్లమెంట్లో శ్రీకాకుళం యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. వైసీపీని టార్గెట్ చేశారు. ముఖ్యంగా వైసీపీ అనాలోచిత నిర్ణయాలను ఎండగట్టారు.చెత్త పన్నుతో సహా పలు రకాల పన్నులు వసూలు చేయడం హేయమయిన చర్య అని అభివర్ణిస్తూ నిన్నటి వేళ సభలో చెలరేగిపోయారు.ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాట్లాడుతూ స్పీకర్ ను కన్విన్స్ చేస్తూ .. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను పూర్తిగా తూర్పారాబట్టారు.అంతేకాదు ఉపాధి హామీ పథకం నిధులను కూడా సరిగా వాడడం చేతగావడం లేదని అంటూ మండిపడ్డారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంలో యువ ఎంపీ రామూ మాట్లాడి, ప్రభుత్వ వైఫల్యాలను ఒక్కొక్కటిగా వివరించారు. దీంతో సభలో వైసీపీ సభ్యులు గొల్లుమన్నారు. అయినా సరే యువ ఎంపీ రాము తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనర్గళంగా మాట్లాడుతూ పాలన పరంగా వైసీపీ ఏ విధంగా విఫలం అవుతున్నదో వివరించేందుకు గణాంక సహితంగా చెప్పేందుకు ప్రయత్నించారు.దీంతో ఎంపీ రాము స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ముఖ్యంగా ప్రత్యేక హోదాకు సంబంధించి ఇప్పటిదాకా వైసీపీ సభ్యులు సభలోనే ప్రస్తావించలేదు అని, ఆ పార్టీకి చెందిన ఇద్దరికి మాట్లాడే అవకాశం ఇచ్చినా కూడా వారు ఆ ప్రస్తావనే తీసుకుని రాలేదు అని ఫైర్ అయ్యారు. అదేవిధంగా వైసీపీ ఎంపీలెవ్వరూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ ఒక్క విషయం కూడా సభ దృష్టి తీసుకు వచ్చిన దాఖలాలే లేవు అని అన్నారు. ఆ రోజు ఎనిమిది సభ్యులున్న వైసీపీ,ఇవాళ 22 మంది ఎంపీలతో కొలువుదీరినా కూడా లాభంలేకుండా పోతోందని, ఆ రోజు మమ్మల్నిగెలిపిస్తే స్పెషల్ స్టేటస్ తెస్తామని చెప్పిన వైసీపీ మాట తప్పిందని ఎంపీ రాము సభ దృష్టికి తీసుకువచ్చారు.
This post was last modified on February 5, 2022 12:45 pm
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ…
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…