టీడీపీకి రాజకీయ మనుగడ ఉండాలంటే ఏపీలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం అనివార్యం. గత ఎన్నికల్లో జగన్ చేతిలో ఘోర పరాజయం చెందిన ఆ పార్టీ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడింది. ఆ తర్వాత కూడా రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైంది. దీంతో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఇప్పటినుంచే కసరత్తులు మొదలెట్టారు. ఆ ఎన్నికల్లో కానీ గెలవకపోతే తన రాజకీయ జీవితం ముగిసినట్లేనని బాబుకు బాగా తెలుసు. అందుకే 2024 ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో ఉద్యోగుల ఆందోళన బాబుకు అనుకోని వరంలా కలిసొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీ విజయాలు సొంతం చేసుకుంది. బాబు కోట కుప్పాన్ని కూల్చే దిశగా సాగుతోంది. పార్టీ అన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నా.. సంక్షేమ పథకాలే తనను వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తాయని సీఎం జగన్ ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ఉద్యమానికి దిగడం ఆయన్ని ఇబ్బంది పెట్టే విషయమే. కొత్తగా ప్రకటించిన పీఆర్సీని వెనక్కి తీసుకోవాలని.. పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించాలని ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. పీఆర్సీ సాధన సమితి పేరుతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నాయి. ఈ విషయంలో జగన్ సెల్ఫ్‌గోల్ చేసుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఉద్యమాన్ని చల్లబరిచే నిర్ణయం తీసుకుంటే జగన్‌కు మేలు జరిగేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పడీ ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా ఒకవేళ సమ్మె జరిగినా జరగకపోయినా వచ్చే ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు వైసీపీకి దూరమయ్యే ప్రమాదం ఉంది. దాదాపు పదిహేను లక్షల మంది ఉన్న ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారతారన్న టాక్ వినిపిస్తోంది. ఇది బాబుకు ఆనందాన్నిచ్చే విషయమే. గత ఎన్నికల్లో కేవలం అయిదు లక్షల ఓట్లతోనే తాము ఓడిపోయామని వచ్చే ఎన్నికల్లో ఉద్యుగులు, పింఛను దారులు తమకు అండగా నిలుస్తారని బాబు విశ్వసిస్తున్నారని సమాచారం.
అందుకే ఉద్యోగ సంఘాలు తమ ఉద్యమానికి ఏ రాజకీయ పార్టీ మద్దతు కోరనప్పటికీ బాబు తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం ఉగ్రవాదుల్లా భావించి జైల్లలో పెడుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల ఆందోళనతో తనకు మేలు జరిగే అవకాశం ఉందని భావించిన ఆయన సమ్మె విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
This post was last modified on February 4, 2022 10:43 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…