Political News

ఉపాధ్యాయుల‌కు ప్ర‌మోష‌న్ల ఎర‌

చ‌లో విజ‌య‌వాడ విజ‌యంతం కావ‌డంతో ఉద్యోగుల ఆందోళ‌న అధికార వైసీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఈ కార్య‌క్ర‌మం స‌క్సెస్‌తో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు స‌మ్మె విష‌యంలోనూ ఇదే వేగంతో సాగేలా క‌నిపిస్తున్నారు. ఈ నెల ఆరు అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లాల‌ని పీఆర్సీ సాధ‌న స‌మితి నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ్మె కానీ ఆరంభ‌మైందంటే సీఎం జ‌గ‌న్‌కు ప్ర‌భుత్వానికి ఇబ్బందులు పెరిగే అవ‌కాశం ఉంది. అందుకే స‌మ్మెకు వెళ్ల‌కుండా అడ్డుకునేందుకు ప్ర‌భుత్వం అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల ప్ర‌యత్నాల‌కు సిద్ధ‌మైంది.

అందులో భాగంగానే ఉపాధ్యాయుల‌ను కూల్ చేసేందుకు రంగం సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం ఇంత‌గా స‌క్సెస్ అయిందంటే ముఖ్య కార‌ణం ఉపాధ్యాయులు. వాళ్లు భారీ సంఖ్య‌లో త‌ర‌లి రావ‌డంతో విజ‌య‌వాడ ద‌ద్ద‌రిల్లింది.

ఈ నేప‌థ్యంలోనే ఉద్య‌మంలో ప్ర‌ధాన భూమిక పోషిస్తున్న ఉపాధ్యాయుల‌ను చ‌ల్ల‌బ‌రిచేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అందులో భాగంగా ఎస్జీటీల‌కు ప్ర‌మోష‌న్ ఆశ చూపుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ 19 పాఠ‌శాల‌ల మ్యాపింగ్ పూర్త‌యింద‌ని 22 వేల మందికి పైగా టీచ‌ర్ల‌కు ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్ర‌మోష‌న్ క‌ల్పించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రో 17 వేల పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల సంఖ్య‌కు అనుగుణంగా టీచ‌ర్ల నియామ‌కాలు రేష‌న‌లైజేష‌న్ ద్వారా మ‌రో 8 వేల మందికి ప‌దోన్న‌తులు ల‌భిస్తాయ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. జూన్ నాటికి మొత్తం 30 వేల మంది ఉపాధ్యాయుల‌కు స్కూల్ అసిస్టెంట్లుగా ప‌దోన్న‌తులను జ‌గ‌న్ స‌ర్కారు క‌ట్ట‌బెట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఉపాధ్యాయుల‌ను ఉద్య‌మం నుంచి వెన‌క్కి లాగేందుకు ప్ర‌మోష‌న్ల పేరుతో ప్ర‌భుత్వం ఎర వేస్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క‌మ‌వుతున్నాయి. మ‌రి ప్ర‌భుత్వ ఆశ‌కు లొంగిపోయి ఉపాధ్యాయులు ఉద్య‌మం నుంచి బ‌య‌ట‌కు వ‌స్తారా? అన్న‌ది అనుమానమే. ఉద్యోగుల డిమాండ్ల‌ను వ‌దిలేసి ఇత‌రేత‌ర మార్గాల్లో సమ్మెను అడ్డుకోవ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించ‌డం ఫ‌లితాన్నిస్తుందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

This post was last modified on February 4, 2022 2:40 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

జగన్ ఫొటో వేయకపోతే ఇంత డ్యామేజ్ జరిగేదా?

ఫొటోల పిచ్చి అనండి.. ప్ర‌చార పిచ్చి అనండి.. ఏదేమైనా ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం చేజేతులా చేసుకున్న వ్య‌వ‌హారం ఇప్పుడు పీక‌ల…

3 mins ago

స్వయంభు కాచుకోవాల్సిన మూడు సవాళ్లు

నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న స్వయంభు షూటింగ్ వేగమందుకుంది. సుమరు ఎనిమిది కోట్ల బడ్జెట్…

11 mins ago

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ…

6 hours ago

ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్ర‌శ్నకు రాజ‌మౌళి అస‌హ‌నం

ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. ఆ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌తో పోలిస్తే జూనియ‌ర్ ఎన్టీఆర్ పాత్ర‌లో అంత బ‌లం…

8 hours ago

మెగా ఎఫెక్ట్‌.. క‌దిలిన ఇండ‌స్ట్రీ..!

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక స‌మ‌రం.. ఓ రేంజ్‌లో హీటు పుట్టిస్తోంది. ప్ర‌ధాన ప‌క్షాలైన‌.. టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన‌లు దూకుడుగా ముందుకు…

9 hours ago

చంద్ర‌బాబు నాకు గురువ‌ని ఎవ‌డ‌న్నాడు: రేవంత్

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. "చంద్ర‌బాబు నాకు గురువ‌ని ఎవ‌డ‌న్నాడు. బుద్ధి…

9 hours ago