ఇష్యూ ఏదైనా సరే.. తనకు తగ్గట్లుగా మార్చుకోవటంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మించినోళ్లు కనిపించరు. విపక్ష నేత చంద్రబాబు మాట్లాడినంతనే.. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచారని.. లోకేశ్ మాట్లాడే ఫారిన్ చదువుల గురించి.. జనసేన అధినేత పవన్ మాట్లాడితే.. ఆయన సామాజిక వర్గానికి చెందిన వారితోనూ.. సినిమా వాళ్లతోనై కౌంటర్ ఇచ్చేయటం.. డోసు సరిపోలేదంటే.. ఆయన పెళ్లిళ్ల మీద నానాయాగీ చేసేటోళ్లు జగన్ పరివారంలో సదా సిద్ధమన్నట్లుగా ఉంటారు.
గడిచిన మూడున్నరేళ్లుగా ఏపీలో ఎన్నో ఇష్యూలు వచ్చాయి. ఆ మాటకు వస్తే.. ఏ ముహుర్తంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారో కానీ.. కుదురుగా.. ఎలాంటి కష్టాన్ని ఫేస్ చేయకుండా పాలన సాగించింది లేదు. ఆయన్ను కెలకటమో.. ఆయనే కెలుక్కోవటమో.. తరచూ ఏదో ఒక రాజకీయ సంచలనం చోటు చేసుకోవటం.. దాన్ని సరిదిద్ది.. సద్దుమణిగేలా చేసే విధానం కంటే కూడా.. విరుచుకుపడే వ్యవహారశైలి ఆయనకు శ్రీరామరక్షగా నిలిచింది. దీనికి తోడు ఆయనకున్న మీడియా బలం.. సలహాదారుల వ్యూహాలు.. వెరసి ఆయనకు ఇబ్బంది లేని పరిస్థితిని తీసుకొచ్చాయి.
అన్నింటికి మించి.. ఒక కొత్త ముఖ్యమంత్రి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత కనీసం ఏడాదిన్నర.. రెండేళ్ల పాటు మారు మాట్లాడకుండా మౌనంగా ఉండే తీరుకు భిన్నంగా.. జగన్ సీఎం అయిన మూడు నెలలకే.. ప్రభుత్వ విధానాలపై చంద్రబాబు విరుచుకుపడటం మొదలు కావటం అధికారపక్ష నేతలకే కాదు.. వారికి అధికారాన్ని అప్పజెప్పిన ప్రజలకు నచ్చలేదు. చంద్రబాబు సన్నిహితులు సైతం.. ఆయన తీరును తప్పు పట్టేవారు. ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత రాక ముందే.. తన మాటలతో ప్రజల్లో వ్యతిరేక ధోరణిని పెంచాలన్న బాబు వ్యూహాం ఆయన్ను ఇరుకున పడేసేలా చేయటమే కాదు.. ఆయన మాటలు చాలా వరకు ప్రజలకు రుచించేవి కావు.
ఒక విధంగా చెప్పాలంటే పవన్ కూడా కొన్ని తప్పులు చేయటం జగన్ కు లాభం చేకూరేలా చేసింది. ప్రభుత్వ విధానాలతో ప్రజల్లో నొప్పికి గురై.. తమ గురించి ఆలోచించే వారు లేరా? తమకు మద్దతుగా ఏదైనా రాజకీయ పక్షం వస్తే బాగుండన్న వరకు విషయాన్ని తీసుకెళ్లకుండా.. ఎప్పటికప్పుడు తామే ముందుగా రియాక్టు కావటం తమకు శాపంగా.. జగన్ కు వరంగా మారుతుందన్న విషయాన్ని కాస్తంత ఆలస్యంగా గుర్తించారు చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ఇద్దరు. దీంతో.. వారు తమ తీరును కాస్త మార్చుకోవటం.. ఉద్యోగుల పీఆర్సీ ఎపిసోడ్ లో ఆచితూచి అన్నట్లు రియాక్టు అయ్యారే కానీ.. ఎక్కువగా పూసుకున్నది లేదు.
తాము ఏమాత్రం పూసుకున్నా.. విషయం తేడా వచ్చేస్తుందన్న విషయాన్ని బాబు.. పవన్ లు గుర్తించి వ్యూహాత్మక మౌనాన్ని ప్రదర్శించారని చెబుతున్నారు.సాధారణంగా ఏదైనా జరిగిందన్నంతనే.. ప్రభుత్వంపై విరుచుకుపడటం ద్వారా.. వారిపై తమను సమర్థించే రంగంలోకి దిగే ధోరణికి భిన్నమైన పరిస్థితులు ఏర్పడటంతో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఎపిసోడ్ లో తాము ఎలా రియాక్టు కావాలన్న విషయంపై జగన్ వ్యూహకర్తలు కన్ఫ్యూజ్ అయినట్లుగా కనిపిస్తోంది. దీనికి తోడు.. ప్రభుత్వ వైఖరిపై పోరాడాలని డిసైడ్ అయిన ఉద్యోగులు.. టీడీపీ.. జనసేనలను దూరంగా పెట్టటం ద్వారా తమను వేలెత్తి చూపే అవకాశాన్ని ఎవరికి ఇవ్వలేదని చెప్పక తప్పదు. పరిస్థితుల్ని గుర్తించిన బాబు.. పవన్ లు.. కాసింత మౌనాన్ని ప్రదర్శించటం జగన్ అండ్ కోను ఇరుకున పడేసేలా చేసిందని చెప్పాలి.
దీనికి తోడు ఉద్యోగులు.. తమకు కొత్త జీతాలు అక్కర్లేదని.. పాత జీతాలు ఇవ్వాలని చెప్పటం.. తమకు జరిగిన నష్టాన్ని సోషల్ మీడియా.. వాట్సాప్ లలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవటం కూడా లాభించిందని చెప్పాలి. ఎందుకంటే.. పీఆర్సీ ఎపిసోడ్ లో ఉద్యోగుల తీరుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే.. కొత్త పీఆర్సీ అక్కర్లేదని.. పాత జీతాల్ని ఇస్తే సరిపోతుందన్న వాదన.. ప్రజల్ని ఆలోచనల్లో పడేసేలా చేసింది. ఇలా.. ఒక్కొక్క అంశం జగన్ అండ్ కోకు ప్రతికూలంగా మారింది. ప్రతి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునే జగన్..తాజా ఎపిసోడ్ లో తమ టీంపై ఉన్న కాన్ఫిడెన్స్ ఈసారి ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారి.. మిస్ ఫైర్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా.. ఎప్పుడూ తనకు కలిసి వచ్చే కాలం ఈసారి కొత్త క్వశ్చన్లను సంధించటం.. విపక్ష పార్టీ అధినేత మౌనం.. జగన్ సర్కారుకు శాపంగా మారింది. ప్రభుత్వంపై సమర శంఖం పూరించిన ఉద్యోగులు సక్సెస్ అయ్యేలా చేసిందని చెప్పక తప్పదు.
This post was last modified on February 4, 2022 9:40 am
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…